హనుమకొండ జిల్లా ఫిషరీస్ వైస్ చైర్మన్‌గా సిరబోయిన సతీష్
ఉమ్మడి వరంగల్ బ్యూరో( భారత శక్తి)జూన్27: హనుమకొండ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా సిరబోయిన సతీష్ నియమితులయ్యారు. వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా సిరబోయిన సతీష్ నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గా ఎన్నికైన సిరబోయిన సతీష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో వైస్ చైర్మన్ బాధ్యతను అప్పగించిన తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కు,వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కు, హనుమకొండ జిల్లా ఫిషరీస్ చైర్మన్ ప్రణయ్ కు, హనుమకొండ జిల్లా మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ కేతిడి దీపక్ రెడ్డి కు,మత్స్యశాఖ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మండల సమ్మయ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలియజేశారు. మత్స్యకారుల సంక్షేమం, ఆధునిక మత్స్యఉత్పత్తి పద్ధతులకు ప్రోత్సాహం, ప్రభుత్వ పథకాలను గ్రామీణ స్థాయికి చేరవేయడం కోసం కృషి చేస్తానని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రకటించిన అన్ని పథకాలను ప్రతి మత్స్యకారునికి చేరేలా వ్యవస్థను బలోపేతం చేయడమే తన లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ బ్యూరో( భారత శక్తి)జూన్27:
హనుమకొండ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా సిరబోయిన సతీష్ నియమితులయ్యారు. వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా సిరబోయిన సతీష్ నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గా ఎన్నికైన సిరబోయిన సతీష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో వైస్ చైర్మన్ బాధ్యతను అప్పగించిన తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కు,వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కు, హనుమకొండ జిల్లా ఫిషరీస్ చైర్మన్ ప్రణయ్ కు, హనుమకొండ జిల్లా మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ కేతిడి దీపక్ రెడ్డి కు,మత్స్యశాఖ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మండల సమ్మయ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలియజేశారు.
మత్స్యకారుల సంక్షేమం, ఆధునిక మత్స్యఉత్పత్తి పద్ధతులకు ప్రోత్సాహం, ప్రభుత్వ పథకాలను గ్రామీణ స్థాయికి చేరవేయడం కోసం కృషి చేస్తానని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రకటించిన అన్ని పథకాలను ప్రతి మత్స్యకారునికి చేరేలా వ్యవస్థను బలోపేతం చేయడమే తన లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.