పంటలు నాశనం చేసే కీటకాలపై అవగాహన సదస్సు

మందమర్రి, జూన్ 27 (భారత శక్తి): మందమర్రి మండలం గుడిపల్లి వెంకటాపూర్ గ్రామ రైతులకు శుక్రవారం వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి పత్తిలో సమగ్ర కీటక యాజమాన్యంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి మాట్లాడుతూ, పత్తి సాగులో భాగంగా రైతులు పొలం చుట్టూ రక్షక పంటలుగా జొన్న మొక్కజొన్న వంటి పంటలు రెండు మూడు వరసల్లో నాటి నట్లయితే పంటకు కీడు చేసే పురుగుల దాడికి రక్షక పంటలుగా ఉపయోగపడి ప్రధాన పంటను శత్రువుల భారీ నుండి రక్షిస్తాయని, పత్తిలో ఎరపంటలుగా బెండ, బంతి వంటి పంటలు 10 వరుసలకు ఒక వరుస నాటుకున్నట్టయితే అవి కాయ దోలుచు పురుగులను, రసం పీల్చే పురుగులను ఆకర్షించి పురుగు ఉధృతిని అంచనా వేయుటకు,నివారించడంలో తోడ్పడతాయని తెలిపారు. అదేవిధంగా అంతర పంటలుగా కంది పెసర వంటి పప్పు ధాన్య పంటలు ఐదు నుంచి పది వరుసలకు ఒక వరుస వెతుకు ఉన్నట్లయితే శత్రు పురుగులను ఆకర్షించడమే కాకుండా మిత్ర పురుగులకు కూడా ఆవాసంగా ఉపయోగపడతాయని, ప్రధాన పంట ద్వారా నష్టం వాటిల్లినప్పుడు ఈ అంతర పంటల ద్వారా కొంత ఆదాయాన్ని పొందవచ్చునని, నత్రజని స్థిరీకరణ జరిగి భూసారం కూడా పెరుగుతుందని తెలిపారు. కావున పత్తి సాగు చేస్తున్న రైతు సోదరులందరూ పైన తెలిపిన విధంగా ఎర పంటలు, రక్షక పంటలు, అంతర పంటలు సాగుచేసి పర్యావరణాన్ని కలుషితం కాకుండా కాపాడుతూ, రసాయనిక పురుగు మందుల ద్వారా జరిగే అధిక ఖర్చులను తగ్గించుకొని, జీవ వైవిధ్యాన్ని పెంపొందించే దిశగా పత్తిని సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు జుంబిడి రాజన్న, భారతపు తిరుపతి, సలేంద్ర పోష మల్లు, దాడి కుమార్, మల్లేష్ తదితరులు ఉన్నారు.

పంటలు నాశనం చేసే కీటకాలపై అవగాహన సదస్సు

మందమర్రి, జూన్ 27 (భారత శక్తి): మందమర్రి మండలం గుడిపల్లి వెంకటాపూర్ గ్రామ రైతులకు శుక్రవారం వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి పత్తిలో సమగ్ర కీటక యాజమాన్యంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి మాట్లాడుతూ, పత్తి సాగులో భాగంగా రైతులు పొలం చుట్టూ రక్షక పంటలుగా జొన్న మొక్కజొన్న వంటి పంటలు రెండు మూడు వరసల్లో నాటి నట్లయితే పంటకు కీడు చేసే పురుగుల దాడికి రక్షక పంటలుగా ఉపయోగపడి ప్రధాన పంటను శత్రువుల భారీ నుండి రక్షిస్తాయని, పత్తిలో ఎరపంటలుగా బెండ, బంతి వంటి పంటలు 10 వరుసలకు ఒక వరుస నాటుకున్నట్టయితే అవి కాయ దోలుచు పురుగులను, రసం పీల్చే పురుగులను ఆకర్షించి పురుగు ఉధృతిని అంచనా వేయుటకు,నివారించడంలో తోడ్పడతాయని తెలిపారు. అదేవిధంగా అంతర పంటలుగా కంది పెసర వంటి పప్పు ధాన్య పంటలు ఐదు నుంచి పది వరుసలకు ఒక వరుస వెతుకు ఉన్నట్లయితే శత్రు పురుగులను ఆకర్షించడమే కాకుండా మిత్ర పురుగులకు కూడా ఆవాసంగా ఉపయోగపడతాయని, ప్రధాన పంట ద్వారా నష్టం వాటిల్లినప్పుడు ఈ అంతర పంటల ద్వారా కొంత ఆదాయాన్ని పొందవచ్చునని, నత్రజని స్థిరీకరణ జరిగి భూసారం కూడా పెరుగుతుందని తెలిపారు.
కావున పత్తి సాగు చేస్తున్న రైతు సోదరులందరూ పైన తెలిపిన విధంగా ఎర పంటలు, రక్షక పంటలు, అంతర పంటలు సాగుచేసి పర్యావరణాన్ని కలుషితం కాకుండా కాపాడుతూ, రసాయనిక పురుగు మందుల ద్వారా జరిగే అధిక ఖర్చులను తగ్గించుకొని, జీవ వైవిధ్యాన్ని పెంపొందించే దిశగా పత్తిని సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు జుంబిడి రాజన్న, భారతపు తిరుపతి, సలేంద్ర పోష మల్లు, దాడి కుమార్, మల్లేష్ తదితరులు ఉన్నారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని...
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి