ఆదర్శ మండలంగా రఘునాథ పాలెం ను తీర్చిదిద్దుతాం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూన్ 26: ఆదర్శంగా రఘునాథపాలెం మండలాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంత్రివర్యులు గురువారం నాడు రఘునాధపాలెం మండలం పుఠాని తండాలో ఎస్టీ.ఎస్.డి.ఎఫ్. నిధులు 20 లక్షలతో, సూర్య తండాలో 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనం వరకు విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్ పోల్స్ వేయాలని అన్నారు. జీపీ భవనానికి కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని, స్టోర్ రూమ్ తొలగించి సమావేశ మందిరం గది విస్తీర్ణం పెంచాలని మంత్రి సూచించారు. జీపీ భవనంలో ఒక రూం ప్రత్యేకంగా రీడింగ్ రూం క్రింద కేటాయించాలని అన్నారు. రఘునాథపాలెం మండలం ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని, తండాలలో పూర్తి స్థాయిలో సిసి రోడ్లు నిర్మిస్తున్నామని, పొలాలకు వెళ్లేందుకు కనీసం మట్టి రోడ్లు అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. రైతులు లాభసాటి ఆయిల్ పామ్ పంట సాగు విస్తరించాలని, అంతర్ పంటల క్రింద కూరగాయలను సాగు చేయవచ్చని అన్నారు. రఘునాథపాలెం మండలంలో స్వామి నారాయణ విద్యా సంస్థ, సమీకృత గురుకులాల నిర్మాణం జరుగుతున్నాయని, అవసరమైతే గిరిజనులకు మరో పాఠశాల తీసుకొని వచ్చి పిల్లలందరు చదువుకునేలా చూస్తామని అన్నారు. మన కుటుంబంలో ఒక వ్యక్తి బాగా చదువుకొని బాగుపడితే మనం పేదరికం నుంచి బయటకు వస్తామని మంత్రి తెలిపారు. పిల్లలకు అవసరమైన విద్యా అవకాశాలను స్థానికంగా అందుబాటులో తీసుకుని వస్తున్నామని అన్నారు. మంచుకొండలో రైతు బజార్ ఏర్పాటు చేశామని, కూరగాయలు చెడిపోకుండా ఉండేందుకు అవసరమైతే ఏసి వాహనాలు సబ్సిడీపై అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. పెండింగ్ పనులను ఒక్కోక్కటిగా చేస్తున్నామని అన్నారు. 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయలను రైతు భరోసా క్రింద రైతుల ఖాతాలో జమ చేశామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ మన గ్రామానికి రూపం గ్రామ పంచాయతీ భవనం అని, దీనిని పూర్తి చేసుకున్న గ్రామస్థులకు అభినందనలు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ భవనం పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, ఇక్కడ ఒక గదిని గ్రంథాలయం లాగా ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైన పుస్తకాలను అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. వానాకాలం వచ్చిన నేపథ్యంలో విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు వ్యాప్తి జరగకుండా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు పుఠానితండా గ్రామంలో 9 మంది, సూర్య తండా గ్రామంలో 10 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డిపిఓ ఆశాలత, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, రఘునాధపాలెం మండల తహసీల్దార్ శ్వేత, ఎంపిడివో అశోక్ కుమార్, ప్రజా ప్రతినిధులు, వివిధ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూన్ 26:
ఆదర్శంగా రఘునాథపాలెం మండలాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
మంత్రివర్యులు గురువారం నాడు రఘునాధపాలెం మండలం పుఠాని తండాలో ఎస్టీ.ఎస్.డి.ఎఫ్. నిధులు 20 లక్షలతో, సూర్య తండాలో 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనం వరకు విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్ పోల్స్ వేయాలని అన్నారు. జీపీ భవనానికి కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని, స్టోర్ రూమ్ తొలగించి సమావేశ మందిరం గది విస్తీర్ణం పెంచాలని మంత్రి సూచించారు.
జీపీ భవనంలో ఒక రూం ప్రత్యేకంగా రీడింగ్ రూం క్రింద కేటాయించాలని అన్నారు. రఘునాథపాలెం మండలం ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని, తండాలలో పూర్తి స్థాయిలో సిసి రోడ్లు నిర్మిస్తున్నామని, పొలాలకు వెళ్లేందుకు కనీసం మట్టి రోడ్లు అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు.
రైతులు లాభసాటి ఆయిల్ పామ్ పంట సాగు విస్తరించాలని, అంతర్ పంటల క్రింద కూరగాయలను సాగు చేయవచ్చని అన్నారు. రఘునాథపాలెం మండలంలో స్వామి నారాయణ విద్యా సంస్థ, సమీకృత గురుకులాల నిర్మాణం జరుగుతున్నాయని, అవసరమైతే గిరిజనులకు మరో పాఠశాల తీసుకొని వచ్చి పిల్లలందరు చదువుకునేలా చూస్తామని అన్నారు.
మన కుటుంబంలో ఒక వ్యక్తి బాగా చదువుకొని బాగుపడితే మనం పేదరికం నుంచి బయటకు వస్తామని మంత్రి తెలిపారు. పిల్లలకు అవసరమైన విద్యా అవకాశాలను స్థానికంగా అందుబాటులో తీసుకుని వస్తున్నామని అన్నారు.
మంచుకొండలో రైతు బజార్ ఏర్పాటు చేశామని, కూరగాయలు చెడిపోకుండా ఉండేందుకు అవసరమైతే ఏసి వాహనాలు సబ్సిడీపై అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.
పెండింగ్ పనులను ఒక్కోక్కటిగా చేస్తున్నామని అన్నారు. 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయలను రైతు భరోసా క్రింద రైతుల ఖాతాలో జమ చేశామని అన్నారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ మన గ్రామానికి రూపం గ్రామ పంచాయతీ భవనం అని, దీనిని పూర్తి చేసుకున్న గ్రామస్థులకు అభినందనలు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ భవనం పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, ఇక్కడ ఒక గదిని గ్రంథాలయం లాగా ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైన పుస్తకాలను అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. వానాకాలం వచ్చిన నేపథ్యంలో విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు వ్యాప్తి జరగకుండా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు పుఠానితండా గ్రామంలో 9 మంది, సూర్య తండా గ్రామంలో 10 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డిపిఓ ఆశాలత, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, రఘునాధపాలెం మండల తహసీల్దార్ శ్వేత, ఎంపిడివో అశోక్ కుమార్, ప్రజా ప్రతినిధులు, వివిధ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.