బొల్లారంలో అంగరంగ వైభవంగా పూరి జగన్నాథుడి రథయాత్ర..
బొల్లారం, జూన్ 27 (భారత శక్తి): పూరి జగన్నాథుడి విశ్వ ప్రసిద్ధ రథయాత్ర పురస్కరించుకుని.. బొల్లారం మున్సిపల్ పరిధిలో గల జగన్నాథుని ఆలయంలో నిర్వహించిన రథయాత్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. రథయాత్ర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వేలాది భక్తుల జయ జయధ్వనుల మధ్య రథయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. మినీ ఇండియా గా పేరుందిన బొల్లారం మున్సిపాలిటీలోని అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్నామని తెలిపారు. పూరి జగన్నాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల పండుగలను సమ ప్రాధాన్యతతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
బొల్లారం, జూన్ 27 (భారత శక్తి):
పూరి జగన్నాథుడి విశ్వ ప్రసిద్ధ రథయాత్ర పురస్కరించుకుని.. బొల్లారం మున్సిపల్ పరిధిలో గల జగన్నాథుని ఆలయంలో నిర్వహించిన రథయాత్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. రథయాత్ర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వేలాది భక్తుల జయ జయధ్వనుల మధ్య రథయాత్ర ప్రారంభమైంది.
ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. మినీ ఇండియా గా పేరుందిన బొల్లారం మున్సిపాలిటీలోని అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్నామని తెలిపారు.
పూరి జగన్నాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.
అన్ని వర్గాల ప్రజల పండుగలను సమ ప్రాధాన్యతతో నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.