కాలానుగుణ వ్యాధుల నిర్మూలనకు ముందస్తు చర్యలు తీసుకోవాలి: అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్.
భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 28: నిర్మల్ జిల్లాలో వర్షాకాలంలో వ్యాపించే కాలానుగుణ వ్యాధుల నియంత్రణకు వైద్యశాఖ పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో జిల్లా వైద్యాధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన, కాలానుగుణ వ్యాధుల నివారణ, టిబి వ్యాధి నిర్మూలన తదితర అంశాలపై సమీక్ష చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో వ్యాధులు విస్తరించే ప్రమాదం ఉన్నందున ముందుగానే ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడినన్ని వ్యాధి నిర్ధారణ కిట్లు, ఔషధాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. టిబి వ్యాధిని నిర్మూలించేందుకు టిబి ముక్త భారత్ కార్యక్రమం పరిధిలో అధికారులు పూర్తిస్థాయిలో కృషి చేయాలని ఆదేశించారు. టిబి బాధితులకు సమయానికి వైద్య సేవలు అందించి, వారిని ఆరోగ్యవంతులుగా మార్చాల్సిన బాధ్యత వైద్యాధికారులదేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. రాజేందర్, డి.సి.ఎచ్ డా. సురేష్, వైద్య శాఖ అధికారులు రవీందర్, రాజా రమేష్, ఆశిష్ రెడ్డి, బోజా రెడ్డి. డాక్టర్ జాదవ్ విజయానంద్. తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 28: నిర్మల్ జిల్లాలో వర్షాకాలంలో వ్యాపించే కాలానుగుణ వ్యాధుల నియంత్రణకు వైద్యశాఖ పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో జిల్లా వైద్యాధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన, కాలానుగుణ వ్యాధుల నివారణ, టిబి వ్యాధి నిర్మూలన తదితర అంశాలపై సమీక్ష చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో వ్యాధులు విస్తరించే ప్రమాదం ఉన్నందున ముందుగానే ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడినన్ని వ్యాధి నిర్ధారణ కిట్లు, ఔషధాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. టిబి వ్యాధిని నిర్మూలించేందుకు టిబి ముక్త భారత్ కార్యక్రమం పరిధిలో అధికారులు పూర్తిస్థాయిలో కృషి చేయాలని ఆదేశించారు. టిబి బాధితులకు సమయానికి వైద్య సేవలు అందించి, వారిని ఆరోగ్యవంతులుగా మార్చాల్సిన బాధ్యత వైద్యాధికారులదేనని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. రాజేందర్, డి.సి.ఎచ్ డా. సురేష్, వైద్య శాఖ అధికారులు రవీందర్, రాజా రమేష్, ఆశిష్ రెడ్డి, బోజా రెడ్డి. డాక్టర్ జాదవ్ విజయానంద్. తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.