యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దు: జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
సంగారెడ్డి, జూన్ 26 (భారత శక్తి ): విద్యార్థులు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ లో పోలీసు, శాఖల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగం రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ లు జెండా ఊపి ప్రారంభించారు . ఈ సందర్భంగా కలెక్టర్ ర్యాలీని నిర్దేశించి మాట్లాడారు . మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఎన్నో రకాల సమస్యలు మాదకద్రవ్యాల వాడకం , అమ్మకాల వ్యాప్తిని నిరోధిం చేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగం రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ అనేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ పేర్కొన్నారు . ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల వాడకం, అమ్మకం పూర్తిగా లేకుండా చేయడం కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. చెడు వ్యసనాల బారిన పడి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని ఈ సందర్భంగా విద్యార్థులకు యువతకు సూచించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు ,కీలక ప్రాంతాలలో చెక్ పోస్టులను పటిష్టం చేస్తున్నట్లు నిఘా విభాగాన్ని అప్రమత్తం చేసి మాదకద్రవ్యాల రవాణా అమ్మకాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీ కలెక్టరేట్ నుండి సంగారెడ్డి ఐ బి వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో లో అదుపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ సంజీవ్ రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు లలిత కుమారి, డి ఇ ఓ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు ,వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి, జూన్ 26 (భారత శక్తి ):
విద్యార్థులు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ లో పోలీసు, శాఖల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగం రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ లు జెండా ఊపి ప్రారంభించారు . ఈ సందర్భంగా కలెక్టర్ ర్యాలీని నిర్దేశించి మాట్లాడారు . మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఎన్నో రకాల సమస్యలు మాదకద్రవ్యాల వాడకం , అమ్మకాల వ్యాప్తిని నిరోధిం చేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగం రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ అనేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ పేర్కొన్నారు .
ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల వాడకం, అమ్మకం పూర్తిగా లేకుండా చేయడం కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. చెడు వ్యసనాల బారిన పడి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని ఈ సందర్భంగా విద్యార్థులకు యువతకు సూచించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు ,కీలక ప్రాంతాలలో చెక్ పోస్టులను పటిష్టం చేస్తున్నట్లు నిఘా విభాగాన్ని అప్రమత్తం చేసి మాదకద్రవ్యాల రవాణా అమ్మకాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీ కలెక్టరేట్ నుండి సంగారెడ్డి ఐ బి వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో లో అదుపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ సంజీవ్ రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు లలిత కుమారి, డి ఇ ఓ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు ,వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.