జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: పి. ప్రావీణ్య జిల్లా కలెక్టర్
సంగారెడ్డి, భారత శక్తి ప్రతినిధి, జూన్ 28: జిల్లాలో తాగునీటి సమస్యలు లేకుండా , అన్ని ఆవాస ప్రాంతాలకు తాగునీరు సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో జిల్లాలోని మంజీరా బ్యారేజీ, సింగూర్ ప్రాజెక్టు నుండి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కు సరఫరా అవుతున్న తాగునీటి వివరాలను, మంజీరా బ్యారేజ్ పరిస్థితి , నారింజ వాగు , సింగూర్ పరివాహక ప్రాంతం, వివరాలు, నూతనంగా చేపట్టిన చెరువుల కుంటల నిర్మాణం పనుల పురోగతి , తాగునీటి సరఫరాల పై నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, మున్సిపల్. అధికారులతో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య , సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం బ్యారేజీల నీటిమట్టాలు ఎంత ఉన్నాయి, నీటి సరఫరా కొనసాగే పరిస్థితి , మిషన్ భగీరథ ,నీరు సరఫరా అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ ,నీరు సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని జరాసంఘం, న్యాల్కల్ మండలాలలో అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ పనులు వెంటనే పూర్తీ అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని గురుకుల సంక్షేమ పాఠశాలలో వసతి గృహాలు అంగన్వాడీ కేంద్రాలకు తాగునీరు సరఫరాయి మంచినీటి కనెక్షన్లు ఏర్పాటు చేయాలని మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.వర్షాకాలాన్ని దృష్టి లో పెట్టుకొని లీకేజీలకు అవసరమైన మరమత్తు పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ప్రజలకు అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ కుళాయిల ద్వారా నాణ్యమైన తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ,మిషన్ భగీరథ డి ఈ రఘువీర్, ,ఏ ఏ పాషా , ఈ ఈ పబ్లిక్ హెల్త్ కృష్ణ మోహన్, నీటిపారుదల శాఖ అధికారులు, మున్సిపల్ ఇంజనీర్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి, భారత శక్తి ప్రతినిధి, జూన్ 28:
జిల్లాలో తాగునీటి సమస్యలు లేకుండా , అన్ని ఆవాస ప్రాంతాలకు తాగునీరు సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో జిల్లాలోని మంజీరా బ్యారేజీ, సింగూర్ ప్రాజెక్టు నుండి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కు సరఫరా అవుతున్న తాగునీటి వివరాలను, మంజీరా బ్యారేజ్ పరిస్థితి , నారింజ వాగు , సింగూర్ పరివాహక ప్రాంతం, వివరాలు, నూతనంగా చేపట్టిన చెరువుల కుంటల నిర్మాణం పనుల పురోగతి , తాగునీటి సరఫరాల పై నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, మున్సిపల్. అధికారులతో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య , సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం బ్యారేజీల నీటిమట్టాలు ఎంత ఉన్నాయి, నీటి సరఫరా కొనసాగే పరిస్థితి , మిషన్ భగీరథ ,నీరు సరఫరా అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ ,నీరు సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని జరాసంఘం, న్యాల్కల్ మండలాలలో అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ పనులు వెంటనే పూర్తీ అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని గురుకుల సంక్షేమ పాఠశాలలో వసతి గృహాలు అంగన్వాడీ కేంద్రాలకు తాగునీరు సరఫరాయి మంచినీటి కనెక్షన్లు ఏర్పాటు చేయాలని మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.వర్షాకాలాన్ని దృష్టి లో పెట్టుకొని లీకేజీలకు అవసరమైన మరమత్తు పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ప్రజలకు అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ కుళాయిల ద్వారా నాణ్యమైన తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ,మిషన్ భగీరథ డి ఈ రఘువీర్, ,ఏ ఏ పాషా , ఈ ఈ పబ్లిక్ హెల్త్ కృష్ణ మోహన్, నీటిపారుదల శాఖ అధికారులు, మున్సిపల్ ఇంజనీర్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.