స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాల్సిందే:ఎంపీ వద్దిరాజు
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూన్ 27: బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కామారెడ్డి బహిరంగ సభలో,ఎన్నికల ప్రచారంలో,మేనిఫెస్టోలో బీసీలకిచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు,విద్యా, ఉద్యోగ రంగాలలో 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాల్సిందేనని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు. ఇందుకోసం బాధ్యతగల ప్రతిపక్షంగా తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, కాంగ్రెస్ పాలకులు,నాయకత్వంతో మరింత వత్తిడి పెంచుతూనే ఉంటుందన్నారు.ఎంపీ వద్దిరాజు శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, సీనియర్ నాయకులు చిరుమళ్ల రాకేష్, ఉపేంద్రాచారి,కోతి కిశోర్ గౌడ్ లతో కలిసి శుక్రవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కాంగ్రెస్ పాలనలో బీసీలకు అన్ని రంగాలలో తీరని అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు మంత్రిమండలిలో కేవలం మూడంటే మూడు పదవులు మాత్రమే ఇవ్వడం ఏ మాత్రం సమంజసం కాదన్నారు.మున్నూరుకాపు,యాదవ, ముస్లిం, లంబాడీ కుర్మ,చాకలి కులాల వారికి మంత్రివర్గంలో చోటివ్వకపోవడం బాధాకరమని ఎంపీ రవిచంద్ర అన్నారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన హయాంలో బీసీలకు సముచిత ప్రాధాన్యతనిచ్చి గౌరవించారని చెప్పారు.అసెంబ్లీ స్పీకర్ గా మధుసూదనాచారి, శాసనమండలి ఛైర్మన్ గా స్వామిగౌడ్, మంత్రులుగా ఈటల రాజేందర్,గంగుల కమలాకర్,జోగు రామన్న,తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పద్మారావు గౌడ్,తనతో పాటు కేశవరావు,డీ.శ్రీనివాస్,బండా ప్రకాష్ ముదిరాజ్ లను రాజ్యసభకు పంపి గౌరవించారని పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగర మేయర్లుగా బొంతు రాంమోహన్, విజయలక్ష్మీ తదితరులకు పదవులిచ్చారని ఎంపీ వద్దిరాజు వివరించారు.కేసీఆర్ సుపరిపాలనకు పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని,కులగణన సందర్భంగా కూడా బీసీల జనాభాను తక్కువ చేసి చూపారని గుర్తు చేశారు.తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని, ఇందుకోసం కాంగ్రెస్ పాలకులు కేంద్ర ప్రభుత్వంపై మరింత వత్తిడి పెంచాలని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు.స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్స్ సాధించుకునేందుకు ఇదే సరైన సమయమని, ఇందుకు బీసీ కులాల వారందరం మరింత ఐక్యతతో పోరాడుదామని ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు.బీసీలకు 42% రిజర్వేషన్స్ సాధనకు ప్రధాని నరేంద్రమోడీ వద్దకు వెంటనే అఖిలపక్షాన్ని తీసుకువెళ్లి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేలా చిత్తశుద్ధితో కృషి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కోసం యుపీఏ పక్షాలతో కూడి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీవ్రతరం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ నాయకత్వంపై ఉందన్నారు.పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బీసీల పక్షాన బీఆర్ఎస్ సంపూర్ణ మద్దుతునిస్తుందని ఎంపీ వద్దిరాజు హామీనిచ్చారు.
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూన్ 27:
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కామారెడ్డి బహిరంగ సభలో,ఎన్నికల ప్రచారంలో,మేనిఫెస్టోలో బీసీలకిచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు,విద్యా, ఉద్యోగ రంగాలలో 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాల్సిందేనని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు. ఇందుకోసం బాధ్యతగల ప్రతిపక్షంగా తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, కాంగ్రెస్ పాలకులు,నాయకత్వంతో మరింత వత్తిడి పెంచుతూనే ఉంటుందన్నారు.ఎంపీ వద్దిరాజు శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, సీనియర్ నాయకులు చిరుమళ్ల రాకేష్, ఉపేంద్రాచారి,కోతి కిశోర్ గౌడ్ లతో కలిసి శుక్రవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కాంగ్రెస్ పాలనలో బీసీలకు అన్ని రంగాలలో తీరని అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు మంత్రిమండలిలో కేవలం మూడంటే మూడు పదవులు మాత్రమే ఇవ్వడం ఏ మాత్రం సమంజసం కాదన్నారు.మున్నూరుకాపు,యాదవ, ముస్లిం, లంబాడీ కుర్మ,చాకలి కులాల వారికి మంత్రివర్గంలో చోటివ్వకపోవడం బాధాకరమని ఎంపీ రవిచంద్ర అన్నారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన హయాంలో బీసీలకు సముచిత ప్రాధాన్యతనిచ్చి గౌరవించారని చెప్పారు.అసెంబ్లీ స్పీకర్ గా మధుసూదనాచారి, శాసనమండలి ఛైర్మన్ గా స్వామిగౌడ్, మంత్రులుగా ఈటల రాజేందర్,గంగుల కమలాకర్,జోగు రామన్న,తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పద్మారావు గౌడ్,తనతో పాటు కేశవరావు,డీ.శ్రీనివాస్,బండా ప్రకాష్ ముదిరాజ్ లను రాజ్యసభకు పంపి గౌరవించారని పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగర మేయర్లుగా బొంతు రాంమోహన్, విజయలక్ష్మీ తదితరులకు పదవులిచ్చారని ఎంపీ వద్దిరాజు వివరించారు.కేసీఆర్ సుపరిపాలనకు పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని,కులగణన సందర్భంగా కూడా బీసీల జనాభాను తక్కువ చేసి చూపారని గుర్తు చేశారు.తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని, ఇందుకోసం కాంగ్రెస్ పాలకులు కేంద్ర ప్రభుత్వంపై మరింత వత్తిడి పెంచాలని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు.స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్స్ సాధించుకునేందుకు ఇదే సరైన సమయమని, ఇందుకు బీసీ కులాల వారందరం మరింత ఐక్యతతో పోరాడుదామని ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు.బీసీలకు 42% రిజర్వేషన్స్ సాధనకు ప్రధాని నరేంద్రమోడీ వద్దకు వెంటనే అఖిలపక్షాన్ని తీసుకువెళ్లి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేలా చిత్తశుద్ధితో కృషి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కోసం యుపీఏ పక్షాలతో కూడి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీవ్రతరం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ నాయకత్వంపై ఉందన్నారు.పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బీసీల పక్షాన బీఆర్ఎస్ సంపూర్ణ మద్దుతునిస్తుందని ఎంపీ వద్దిరాజు హామీనిచ్చారు.