పారిశ్రామిక వివాదాల చట్టం-1947, ఫ్యాక్టరీల చట్టం-1948
కనీస వేతనాల చట్టం-1948 పకడ్బందీగా అమలు చేయాలి.. టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 15:
రాష్ట్రంలో వివిధ పరిశ్రమలలో భద్రత ప్రమాణాలపై ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నిరంతరం తనిఖీలు చేపట్టాలని అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి కోరారు. హుజూర్ నగర్ పట్టణంలో వివిధ రంగాల కార్మికులతో రోషపతి మాట్లాడుతూ సంగారెడ్డిలో సిగాచి పరిశ్రమ వాడలో 45 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయని ఎనిమిది మంది ఆచూకీ లభించలేదని వివిధ ఆస్పత్రిలో 33 మంది చికిత్స పొందుతున్నారని అన్నారు. వీరికి ప్రకటించిన ఆర్థిక సహాయం మృతి చెందిన వారికి కోటి రూపాయలు, ప్రమాదంలో గాయపడ్డ వారికి 50 లక్షలు ఇవ్వాలని పారిశ్రామిక విధానాల చట్టం 1947 ఫ్యాక్టరీల చట్టం 1948 కనీస వేతనాల చట్టం 1948 సమాన పనికి సమాన వేతనం చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సిమెంటు పరిశ్రమలలో మరియు వివిధ రకాల పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు చూడాలని ప్రతి పరిశ్రమలను తప్పనిసరి గా తనిఖీ లు చేయాలని కోరినారు. తెలంగాణ రాష్ట్రంలో రాజధాని అయిన హైదరాబాదులో కల్తీ కల్లు వల్ల పదిమంది మృతి 34 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి కల్తీ కల్లు విక్రయించకుండా నివారించాలని,వివిధ కూలీ పనులు చేసుకొని అలసిపోయిన కార్మికులు కల్లు సేవించిన వారు ప్రాణాల మీదికి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టి ఎన్ టి యు సి నాయకులు గుండెబోయిన వెంకన్న యాదవ్, రామయ్య, ప్రకాష్, ఆజాద్, ప్రభాకర్, ప్రసాదు, సతీష్, వెంకటేశ్వర్లు, రాములు తదితరులు పాల్గొన్నారు.