బాసర ఆర్జీయూకేటీలో స్పోర్ట్స్, ఎన్‌సిసి కోటా ధ్రువపత్రాల పరిశీలన
భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 27: నిర్మల్ జిల్లా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ), బాసరలో మహబూబ్‌నగర్ కేంద్రానికి చెందిన స్పోర్ట్స్ మరియు ఎన్‌సిసి కోటా ఆధారిత విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్, ఓఎస్‌డీ ప్రొఫెసర్ ఈ. మురళీధర్షన్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ “యూనివర్సిటీ చాలా సమర్థంగా, సజావుగా ముందుకు సాగుతోంది. మేం విద్యా నాణ్యతకు, విద్యార్థుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతి సమస్యను పట్టుదలగా పరిష్కరిస్తూ, సమర్థవంతంగా యూనివర్సిటీ నడవడం మా ముఖ్య ఉద్దేశ్యం” అని అన్నారు. ఎన్‌సిసి కోటాలో విద్యార్థులు సమర్పించిన క్యాంప్ సర్టిఫికెట్‌లు, రిపబ్లిక్ డే పరేడ్ (ఆర్డీసీ) సర్టిఫికెట్‌లు, బి అండ్ సి సర్టిఫికెట్‌లు పూర్తిగా పరిశీలించబడ్డాయి. స్పోర్ట్స్ కోటా కోసం 31 క్రీడల జాబితాలో లభించే ఆటల ఆధారంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పొందిన ప్రమాణపత్రాలను ఖచ్చితంగా ధ్రువీకరించారు. క్రీడా సంఘాల గుర్తింపు, పోటీల స్థాయి, తేదీ, మరియు అర్హత ప్రమాణాలను బట్టి జాగ్రత్తగా తనిఖీ చేయబడింది. ఈ కార్యక్రమంలో ధ్రువపత్రాల పరిశీలనను కన్వీనర్ డా.చంద్రశేఖర్ సమన్వయంతో, కో-కన్వీనర్లు డా. దేవరాజు, డా. విట్టల్, డా. భవ్‌సింగ్, డా. రాకేష్ రెడ్డి నిర్వహించారు. ఎన్‌సిసి ఇన్‌ఛార్జి దస్తగిరి, స్పోర్ట్స్ ఇన్‌ఛార్జి పిడీ శ్యాం బాబు, సహాయకులు కిషన్, ఉదయ్, అశోక్ తదితరులు పాల్గొని సమర్థవంతంగా నిర్వహణలో సహకరించారు. స్పోర్ట్స్ ఎన్‌సిసి అధికారుల సమక్షంలో ధ్రువీకరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగింది.
భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 27: నిర్మల్ జిల్లా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ), బాసరలో మహబూబ్‌నగర్ కేంద్రానికి చెందిన స్పోర్ట్స్ మరియు ఎన్‌సిసి కోటా ఆధారిత విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్, ఓఎస్‌డీ ప్రొఫెసర్ ఈ. మురళీధర్షన్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ
“యూనివర్సిటీ చాలా సమర్థంగా, సజావుగా ముందుకు సాగుతోంది. మేం విద్యా నాణ్యతకు, విద్యార్థుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతి సమస్యను పట్టుదలగా పరిష్కరిస్తూ, సమర్థవంతంగా యూనివర్సిటీ నడవడం మా ముఖ్య ఉద్దేశ్యం” అని అన్నారు. ఎన్‌సిసి కోటాలో విద్యార్థులు సమర్పించిన క్యాంప్ సర్టిఫికెట్‌లు, రిపబ్లిక్ డే పరేడ్ (ఆర్డీసీ) సర్టిఫికెట్‌లు, బి అండ్ సి
సర్టిఫికెట్‌లు పూర్తిగా పరిశీలించబడ్డాయి. స్పోర్ట్స్ కోటా కోసం 31 క్రీడల జాబితాలో లభించే ఆటల ఆధారంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పొందిన ప్రమాణపత్రాలను ఖచ్చితంగా ధ్రువీకరించారు. క్రీడా సంఘాల గుర్తింపు, పోటీల స్థాయి, తేదీ, మరియు అర్హత ప్రమాణాలను బట్టి జాగ్రత్తగా తనిఖీ చేయబడింది. ఈ కార్యక్రమంలో ధ్రువపత్రాల పరిశీలనను కన్వీనర్ డా.చంద్రశేఖర్ సమన్వయంతో, కో-కన్వీనర్లు డా. దేవరాజు, డా. విట్టల్, డా. భవ్‌సింగ్, డా. రాకేష్ రెడ్డి నిర్వహించారు. ఎన్‌సిసి ఇన్‌ఛార్జి దస్తగిరి, స్పోర్ట్స్ ఇన్‌ఛార్జి పిడీ శ్యాం బాబు, సహాయకులు కిషన్, ఉదయ్, అశోక్ తదితరులు పాల్గొని సమర్థవంతంగా నిర్వహణలో సహకరించారు. స్పోర్ట్స్ ఎన్‌సిసి అధికారుల సమక్షంలో ధ్రువీకరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగింది.