ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూన్ 28: ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలలో విశ్వాసం కల్పించాలని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య శాఖ సేవా దృక్పథంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ప్రభుత్వం పేదల వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శనివారం తనిఖీ చేశారు. ఆస్పత్రి అంతా కలియతిరిగి, స్కానింగ్ గది, జనరల్ ఓపి, డ్రెస్సింగ్ రూం, ఇంజక్షన్ రూం, ఎక్స్ రే రూం, డెంటల్ విభాగం, ఫార్మసీ, డయాలసిస్ వార్డులను లను పరిశీలించారు. ఏఎన్సి రిజిస్ట్రేషన్, ఎన్సిడి సర్వే గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు గురించి అడిగి, సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. పిల్లల వైద్యులు ఉన్నారా, ఏ ఏ విభాగాల వైద్యుల అవసరం ఉన్నది అడిగి తెలుసుకున్నారు. స్కానింగ్, ఎక్స్ రే విభాగంలో టెక్నీషియన్ లు ఉన్నది, ఇంకా ఏమేం అవసరాలు ఉన్నది ఆడిగారు. నాల్గవ తరగతి సిబ్బంది సరిపోను ఉన్నట్లు, క్రొత్త భవనానికి తగ్గట్లు పారిశుద్ద్యానికి మరింత సిబ్బంది నియమించుకోవచ్చన్నారు. పారా మెడికల్ సిబ్బంది వివరాలు అడిగారు. అందుబాటులో ఉన్న మందులు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలు అందించాలని, మందుల నిల్వలు సరిపడా ఉండే విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో ఉండాలని తెలుపుతూ, ఆసుపత్రిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. జనరల్ ఓపి ఆన్ లైన్ లో జరుగుతుందా, మాన్యువల్ గా జరుగుతుందా అని అడిగగా, రెండు విధాలుగా జరుగుతున్నట్లు వైద్యాధికారులు సమాధానం ఇచ్చారు. ఆన్ లైన్ ఓపి నమోదు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. డయాలసిస్ విభాగం ద్వారా ప్రతి రోజు 20 మందికి డయాలసిస్ చేపడుతున్నట్లు, ఏరియా ఆసుపత్రి పరిధిలో 41 మంది రోగులు డయాలసిస్ కొరకు నమోదైనట్లు, వీరే రిపీటెడ్ గా వస్తున్నట్లు తెలిపారు. వ్యాధి వచ్చాక కాక, రాకుండా నియంత్రణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఆహారం, జీవన శైలి పై చైతన్యం తేవాలని కలెక్టర్ అన్నారు. పెయిన్ కిల్లర్ల వాడకం తగ్గించాలని, మెడికల్ షాపులు పెయిన్ కిల్లర్ల అమ్మకంపై నియంత్రణ చేయాలని అన్నారు. ఏరియా ఆసుపత్రికి కావాల్సిన పరికరాలు అందజేస్తామని, కాంట్రాక్టు రెన్యూవల్ కు చర్యలు చేపడతామని, ఆసుపత్రిలో జనరల్ సర్జన్ నియామకానికి, అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తామని కలెక్టర్ అన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని, వ్యక్తిగత, పరిసరాల శుభ్రతపై చైతన్యం కలిగించాలని కలెక్టర్ అన్నారు. మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యాధికారులు, సిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. అంతకుముందు కలెక్టర్, రూ. 34 కోట్లతో నిర్మిస్తున్న ఆసుపత్రి నూతన భవనాన్ని క్షుణంగా పరిశీలించారు. కొత్త భవనంతో ప్రజలకు మరిన్ని వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, చిన్న చిన్న పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. రూ. 25 కోట్లతో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కళాశాల నూతన భవన పనులను కలెక్టర్ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తనిఖీల సందర్భంగా డిసిహెచ్ఓ డా. రాజశేఖర్, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్, వైద్య శాఖ ఇఇ ఉమామహేశ్వర రావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు, అధికారులు, తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూన్ 28:

ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలలో విశ్వాసం కల్పించాలని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య శాఖ సేవా దృక్పథంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ప్రభుత్వం పేదల వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్, సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శనివారం తనిఖీ చేశారు. ఆస్పత్రి అంతా కలియతిరిగి, స్కానింగ్ గది, జనరల్ ఓపి, డ్రెస్సింగ్ రూం, ఇంజక్షన్ రూం, ఎక్స్ రే రూం, డెంటల్ విభాగం, ఫార్మసీ, డయాలసిస్ వార్డులను లను పరిశీలించారు.

ఏఎన్సి రిజిస్ట్రేషన్, ఎన్సిడి సర్వే గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు గురించి అడిగి, సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. పిల్లల వైద్యులు ఉన్నారా, ఏ ఏ విభాగాల వైద్యుల అవసరం ఉన్నది అడిగి తెలుసుకున్నారు. స్కానింగ్, ఎక్స్ రే విభాగంలో టెక్నీషియన్ లు ఉన్నది, ఇంకా ఏమేం అవసరాలు ఉన్నది ఆడిగారు. నాల్గవ తరగతి సిబ్బంది సరిపోను ఉన్నట్లు, క్రొత్త భవనానికి తగ్గట్లు పారిశుద్ద్యానికి మరింత సిబ్బంది నియమించుకోవచ్చన్నారు. పారా మెడికల్ సిబ్బంది వివరాలు అడిగారు. అందుబాటులో ఉన్న మందులు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలు అందించాలని, మందుల నిల్వలు సరిపడా ఉండే విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో ఉండాలని తెలుపుతూ, ఆసుపత్రిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

జనరల్ ఓపి ఆన్ లైన్ లో జరుగుతుందా, మాన్యువల్ గా జరుగుతుందా అని అడిగగా, రెండు విధాలుగా జరుగుతున్నట్లు వైద్యాధికారులు సమాధానం ఇచ్చారు. ఆన్ లైన్ ఓపి నమోదు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. డయాలసిస్ విభాగం ద్వారా ప్రతి రోజు 20 మందికి డయాలసిస్ చేపడుతున్నట్లు, ఏరియా ఆసుపత్రి పరిధిలో 41 మంది రోగులు డయాలసిస్ కొరకు నమోదైనట్లు, వీరే రిపీటెడ్ గా వస్తున్నట్లు తెలిపారు. వ్యాధి వచ్చాక కాక, రాకుండా నియంత్రణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఆహారం, జీవన శైలి పై చైతన్యం తేవాలని కలెక్టర్ అన్నారు. పెయిన్ కిల్లర్ల వాడకం తగ్గించాలని, మెడికల్ షాపులు పెయిన్ కిల్లర్ల అమ్మకంపై నియంత్రణ చేయాలని అన్నారు.

ఏరియా ఆసుపత్రికి కావాల్సిన పరికరాలు అందజేస్తామని, కాంట్రాక్టు రెన్యూవల్ కు చర్యలు చేపడతామని, ఆసుపత్రిలో జనరల్ సర్జన్ నియామకానికి, అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తామని కలెక్టర్ అన్నారు.

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని, వ్యక్తిగత, పరిసరాల శుభ్రతపై చైతన్యం కలిగించాలని కలెక్టర్ అన్నారు. మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యాధికారులు, సిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు.

అంతకుముందు కలెక్టర్, రూ. 34 కోట్లతో నిర్మిస్తున్న ఆసుపత్రి నూతన భవనాన్ని క్షుణంగా పరిశీలించారు. కొత్త భవనంతో ప్రజలకు మరిన్ని వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, చిన్న చిన్న పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. రూ. 25 కోట్లతో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కళాశాల నూతన భవన పనులను కలెక్టర్ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ తనిఖీల సందర్భంగా డిసిహెచ్ఓ డా. రాజశేఖర్, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్, వైద్య శాఖ ఇఇ ఉమామహేశ్వర రావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు, అధికారులు, తదితరులు ఉన్నారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని...
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి