రైతులకు కావాల్సినన్ని విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి: జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూన్ 28: రైతులకు వ్యవసాయానికి కావాల్సినన్ని విత్తనాలు, ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టర్ సత్తుపల్లి లోని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో విత్తనాలు, ఎరువులు, మందుల లభ్యతను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఏ ఏ విత్తనాలు ఎక్కువగా అమ్ముడవుతున్నది, రైతులు అడిగే రకాలు అందుబాటులో ఉంచుతుంది అడిగి తెలుసుకున్నారు. ఎరువులు ఈ-పాస్ మిషన్ ద్వారానే అమ్మకాలు జరగాలని, మాన్యువల్ గా అంగీకరించేది లేదని కలెక్టర్ అన్నారు. ఈ-పాస్ మిషన్ పనితీరును పరిశీలించారు. విక్రయాల రిజిస్టర్లు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండడంతో, రైతులు వరిపై మొగ్గు చూపుతున్నారని, అధిక లాభాలున్న హార్టికల్చర్ పట్ల రైతులను ప్రోత్సహించాలన్నారు. పామాయిల్ పంట చాలా లాభదాయకమని, అంతర పంటలుగా ఇతర పంటలను సాగు చేయవచ్చని అన్నారు. డ్రోన్ తో ఎరువుల, క్రీమీ సంహారకాల పిచికారీ తో ఖర్చు, సమయం ఆదా అవుతుందని అన్నారు. వ్యవసాయ అధికారులు, వారి వారి లక్ష్యం మేరకు విత్తన, ఎరువుల విక్రయ కేంద్రాల తనిఖీలు చేపట్టాలన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వి. శ్రీనివాస రెడ్డి, సత్తుపల్లి మండల వ్యవసాయ అధికారి వై. శ్రీనివాసరావు, అధికారులు, తదితరులు ఉన్నారు.

రైతులకు కావాల్సినన్ని విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి: జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూన్ 28:

రైతులకు వ్యవసాయానికి కావాల్సినన్ని విత్తనాలు, ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టర్ సత్తుపల్లి లోని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు.
ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో విత్తనాలు, ఎరువులు, మందుల లభ్యతను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఏ ఏ విత్తనాలు ఎక్కువగా అమ్ముడవుతున్నది, రైతులు అడిగే రకాలు అందుబాటులో ఉంచుతుంది అడిగి తెలుసుకున్నారు. ఎరువులు ఈ-పాస్ మిషన్ ద్వారానే అమ్మకాలు జరగాలని, మాన్యువల్ గా అంగీకరించేది లేదని కలెక్టర్ అన్నారు. ఈ-పాస్ మిషన్ పనితీరును పరిశీలించారు. విక్రయాల రిజిస్టర్లు నిర్వహించాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండడంతో, రైతులు వరిపై మొగ్గు చూపుతున్నారని, అధిక లాభాలున్న హార్టికల్చర్ పట్ల రైతులను ప్రోత్సహించాలన్నారు. పామాయిల్ పంట చాలా లాభదాయకమని, అంతర పంటలుగా ఇతర పంటలను సాగు చేయవచ్చని అన్నారు. డ్రోన్ తో ఎరువుల, క్రీమీ సంహారకాల పిచికారీ తో ఖర్చు, సమయం ఆదా అవుతుందని అన్నారు. వ్యవసాయ అధికారులు, వారి వారి లక్ష్యం మేరకు విత్తన, ఎరువుల విక్రయ కేంద్రాల తనిఖీలు చేపట్టాలన్నారు.
కలెక్టర్ తనిఖీ సందర్భంగా కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వి. శ్రీనివాస రెడ్డి, సత్తుపల్లి మండల వ్యవసాయ అధికారి వై. శ్రీనివాసరావు, అధికారులు, తదితరులు ఉన్నారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని...
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి