పాఠశాల అభివృద్ధిలో రవీంద్రబాబు సేవలుప్రశంసనీయం: రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదాపీర్
పోరుమామిళ్ల, భారత శక్తి ప్రతినిధి, జూన్ 28: రెడ్డికొట్టాలప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధికి రవీంద్రబాబు చేసినసేవలు ప్రశంసనీయమని రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదా పీర్, ప్రధానోపాధ్యాయులు వాకా చంద్రశేఖర్ అన్నారు. 2017 నుండి 8 సంవత్సరాల పాటు రెడ్డికొట్టాల ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుని గాను, ప్రధానోపాధ్యాయునిగాను రవీంద్రబాబు పనిచేసి పాఠశాలను అభివృద్ధి బాటలో పయనింప చేశారన్నారు. ఇటీవల వంకమర్రి పాఠశాలకు బదిలీపై వెళ్లిన సందర్భంగా శనివారం సాయంత్రం రెడ్డి కొట్టాల ఉన్నత పాఠశాలలో రవీంద్రబాబును ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన సభలో చంద్రశేఖర్, దాదా పీర్ మాట్లాడుతూ రెడ్డి కొట్టాల ప్రాథమికోన్నత పాఠశాలను మోడల్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలగా అప్గ్రేట్ చేయడంలో రవీంద్ర బాబు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అటు ఉపాధ్యాయుల ఇటు గ్రామస్తుల సహకారం తీసుకుని పాఠశాలను అభివృద్ధి బాటలో నడిపారన్నారు. ఉన్నత పాఠశాల గా మారిన తర్వాత మరో ఏడాది ఆయన ఇదే పాఠశాలలలో కొనసాగి ఉంటే బాగుండేదని వారు అభిప్రాయప డ్డారు. ప్రస్తుతం పాఠశాలలో అన్ని వసతులతో పాటు తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండటం వలన తల్లిదండ్రులు తమ బిడ్డలను రెడ్డి కొట్టాల ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం రవీంద్రబాబును శాలువా, పూలమాల, బహుమతులతో ఘనంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానం చేశారు. తనకు సన్మానం చేసినందుకు రవీంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేస్తూ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఖదీర్ బాష, సురేష్ కుమార్, మహేష్ కుమార్, వెంకటసుబ్బయ్య, దేవరాజు, శ్రీలత, విజయలక్ష్మి, సావిత్రి, పరిమళ జ్యోతి రాధిక, స్థానికులు కొండయ్య, బాలకృష్ణ, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
పోరుమామిళ్ల, భారత శక్తి ప్రతినిధి, జూన్ 28:
రెడ్డికొట్టాలప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధికి రవీంద్రబాబు చేసినసేవలు ప్రశంసనీయమని రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదా పీర్, ప్రధానోపాధ్యాయులు వాకా చంద్రశేఖర్ అన్నారు. 2017 నుండి 8 సంవత్సరాల పాటు రెడ్డికొట్టాల ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుని గాను, ప్రధానోపాధ్యాయునిగాను రవీంద్రబాబు పనిచేసి పాఠశాలను అభివృద్ధి బాటలో పయనింప చేశారన్నారు. ఇటీవల వంకమర్రి పాఠశాలకు బదిలీపై వెళ్లిన సందర్భంగా శనివారం సాయంత్రం రెడ్డి కొట్టాల ఉన్నత పాఠశాలలో రవీంద్రబాబును ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన సభలో చంద్రశేఖర్, దాదా పీర్ మాట్లాడుతూ రెడ్డి కొట్టాల ప్రాథమికోన్నత పాఠశాలను మోడల్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలగా అప్గ్రేట్ చేయడంలో రవీంద్ర బాబు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అటు ఉపాధ్యాయుల ఇటు గ్రామస్తుల సహకారం తీసుకుని పాఠశాలను అభివృద్ధి బాటలో నడిపారన్నారు. ఉన్నత పాఠశాల గా మారిన తర్వాత మరో ఏడాది ఆయన ఇదే పాఠశాలలలో కొనసాగి ఉంటే బాగుండేదని వారు అభిప్రాయప డ్డారు. ప్రస్తుతం పాఠశాలలో అన్ని వసతులతో పాటు తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండటం వలన తల్లిదండ్రులు తమ బిడ్డలను రెడ్డి కొట్టాల ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం రవీంద్రబాబును శాలువా, పూలమాల, బహుమతులతో ఘనంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానం చేశారు. తనకు సన్మానం చేసినందుకు రవీంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేస్తూ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఖదీర్ బాష, సురేష్ కుమార్, మహేష్ కుమార్, వెంకటసుబ్బయ్య, దేవరాజు, శ్రీలత, విజయలక్ష్మి, సావిత్రి, పరిమళ జ్యోతి రాధిక, స్థానికులు కొండయ్య, బాలకృష్ణ, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.