ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
జాయింట్ కలెక్టర్ అదితి సింగ్
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సబా భవన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, డిఆర్వో విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ మాట్లాడుతూ... ఫిర్యాదులకు అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని సూచిస్తూ.. అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా.. ప్రజల నుండి అందిన కొన్ని పిర్యాదులు..
1)కడప ఇందిరా నగర్ కు చెందిన గౌతమి
మా ఇద్దరు పిల్లలు కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటున్నారని, తల్లికి వందనం నగదు జమకాలేదని, మా అర్జీని పరిశీలించి తల్లికి వందనం పథకం మంజూరు చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ వారికి అర్జీ సమర్పించారు.
2)కొండాపురం మండలం ఏటూరు గ్రామానికి చెందిన దీపిక ఇప్పట్ల అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి చదివేందుకు సీట్ ఇప్పించాలని జిల్లా కలెక్టర్ కు పిజిఆర్ఎస్ లో అర్జీ సమర్పించారు.
3)ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన జయరాజు తమ ఇంటి ముందు డ్రైనేజీ కాలువలో మురుగునీరు తొలగించకపోవడంతో వ్యర్థాలు పేరుకుపోయాయని, అధికారులు తగు చర్యలు తీసుకొని మురుగు కాలువ వ్యర్థాలను తొలగించాలని పిజిఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి రాజ్యలక్ష్మి,ఎస్డీసీ వెంకటపతి, మెప్మా పీడీ కిరణ్ కుమార్,వివిధ శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.