నూతన మున్సిపాలిటీలతో సమగ్ర అభివృద్ధి: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు, జూన్ 26(భారత శక్తి): శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఏర్పరచడం ద్వారా.. సమగ్ర అభివృద్ధితోపాటు భవిష్యత్తు తరాలకు మెరుగైన పరిపాలన అందించడం సాధ్యమవుతుందని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్‌చెరు మండల పరిధిలోని ఇంద్రేశం కేంద్రంగా నూతన మున్సిపాలిటీగా ఏర్పరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా.. ఇంద్రేశం గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పటాన్‌చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెద్ద ఎత్తున కాలనీలు ఏర్పడుతున్నాయని తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్ తో పాటు నూతనంగా ఇంద్రేశం, జిన్నారం కేంద్రాలుగా మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని తెలిపారు. మున్సిపాలిటీల ద్వారా పరిపాలన వికేంద్రీకరణ జరగడంతో పాటు.. అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరు కావడం జరుగుతుందని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దెందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేయనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలు ఏర్పాటయితే పన్నుల భారం పెరుగుతుందని ప్రజలు అపోహలకు గురికావద్దని కోరారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంద్రేశం గ్రామ మాజీ సర్పంచ్ రామచంద్ర రెడ్డి, శివారెడ్డి, హరినారాయణ గౌడ్, నరసింహ రెడ్డి, గ్రామ పుర ప్రముఖులు పాల్గొన్నారు.

నూతన మున్సిపాలిటీలతో సమగ్ర అభివృద్ధి:  పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు, జూన్ 26(భారత శక్తి):
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఏర్పరచడం ద్వారా.. సమగ్ర అభివృద్ధితోపాటు భవిష్యత్తు తరాలకు మెరుగైన పరిపాలన అందించడం సాధ్యమవుతుందని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

పటాన్‌చెరు మండల పరిధిలోని ఇంద్రేశం కేంద్రంగా నూతన మున్సిపాలిటీగా ఏర్పరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా.. ఇంద్రేశం గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పటాన్‌చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెద్ద ఎత్తున కాలనీలు ఏర్పడుతున్నాయని తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్ తో పాటు నూతనంగా ఇంద్రేశం, జిన్నారం కేంద్రాలుగా మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని తెలిపారు.

మున్సిపాలిటీల ద్వారా పరిపాలన వికేంద్రీకరణ జరగడంతో పాటు.. అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరు కావడం జరుగుతుందని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దెందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేయనున్నట్లు తెలిపారు.
మున్సిపాలిటీలు ఏర్పాటయితే పన్నుల భారం పెరుగుతుందని ప్రజలు అపోహలకు గురికావద్దని కోరారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇంద్రేశం గ్రామ మాజీ సర్పంచ్ రామచంద్ర రెడ్డి, శివారెడ్డి, హరినారాయణ గౌడ్, నరసింహ రెడ్డి, గ్రామ పుర ప్రముఖులు పాల్గొన్నారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని...
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి