మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి : జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జూన్ 28: పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి పాఠశాలలో తరగతి గదులను పరిశీలించి పదవ తరగతి విద్యార్థులకు కాసేపు గణితం బోధించారు. విద్యార్థులచే బోర్డు మీద లెక్కలు చేయించారు. పదవ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రతి విద్యార్థి ప్రత్యేక దృష్టి సాధించి కష్టపడి చదవాలని సూచించారు. పాఠశాల మైదానం పరిశీలించి శారీరకంగా మానసికంగా, ఆరోగ్యంగా ఎదిగేందుకు చదువుతోపాటు ప్రతి విద్యార్థి క్రీడలలో తప్పక పాల్గొనాలని సూచించారు. ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని, అలాగే సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాఠశాల పరిసర ప్రాంతాలను, టాయిలెట్స్ కూడా శుభ్రంగా ఉంచాలని తెలిపారు. అలాగే పాఠశాలలోని అందరి విద్యా ర్థులు స్కూల్ యూనిఫామ్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తదితరులు పాల్గొన్నారు.

మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి : జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జూన్ 28: పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు.
శనివారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి పాఠశాలలో తరగతి గదులను పరిశీలించి పదవ తరగతి విద్యార్థులకు కాసేపు గణితం బోధించారు. విద్యార్థులచే బోర్డు మీద లెక్కలు చేయించారు. పదవ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రతి విద్యార్థి ప్రత్యేక దృష్టి సాధించి కష్టపడి చదవాలని సూచించారు. పాఠశాల మైదానం పరిశీలించి శారీరకంగా మానసికంగా, ఆరోగ్యంగా ఎదిగేందుకు చదువుతోపాటు ప్రతి విద్యార్థి క్రీడలలో తప్పక పాల్గొనాలని సూచించారు. ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని, అలాగే సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాఠశాల పరిసర ప్రాంతాలను, టాయిలెట్స్ కూడా శుభ్రంగా ఉంచాలని తెలిపారు. అలాగే పాఠశాలలోని అందరి విద్యా ర్థులు స్కూల్ యూనిఫామ్ ధరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని...
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి