అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవంలో బాగంగా డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలి : జిల్లా కలెక్టర్
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జూన్ 26: అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ జేండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ , జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, కామారెడ్డి జిల్లా ఉన్నత అధికారులు అందరూ, వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు ర్యాలీ లో పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హితవు పలికారు. గురువారం జిల్లా సంక్షేమ శాఖ, పోలీస్, మద్య నిషేధ మరియు ఆబ్కారీ శాఖ సమన్వయంతో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్,జిల్లా జడ్జి వరప్రసాద్, సివిల్ జడ్జి శ్రీమతి నాగరాని , అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి , జిల్లా మద్య నిషేద, ఆబ్కారీ అధికారి బి.హనుమంతరావు, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, కామారెడ్డి ఆర్ డి ఒ వీణ, కామారెడ్డి డిఇఒ రాజు, కామారెడ్డి తాసిల్దార్ జనార్దన్ జిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులతో కలిసి సిఎస్ఐ చర్చి నుండి కళాభారతి ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. విద్యార్థులు, అంగన్వాడి టీచర్లు, పోలిస్ సిబ్బంది ఆశా వర్కర్లు, మహిళలు, ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో పాల్గొనగా సిఎస్ఐ చర్చి నుండి కళాభారతి ఆడిటోరియం వరకు డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఉత్సాహభరితంగా కొనసాగింది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే వచ్చే నష్టాలు, కుటుంబంలో మన తల్లిదండ్రులు, మన కుటుంబీకులు పొందే దుఃఖం అధికంగా ఉంటుందని, చెడు అలవాట్లకు మొదటి నుంచి దూరంగా ఉండాలని తెలిపారు. నేటి యువత రేపటి భావి భారత పౌరులని, వీరిలో కొంతమంది డ్రగ్స్ కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని, దీనిని గుర్తించి డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన పెంచుకొని దూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. యువత డ్రగ్స్ తో పాటు, గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాలు, సిగరెట్ మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉండాలని, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆలోచనా విధానం ఆలోచన శక్తి నశిస్తాయని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ చాలా కీలకమని, వీటిని ఎట్టి పరిస్థితులలో కోల్పోవద్దని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు తాము కష్టాలు పడుతూ పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పిస్తారని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేసుకోవద్దని, మనం చెడు అలవాట్లకు గురైతే తల్లిదండ్రులు పడే క్షోభ వర్ణనాతీతమని, ఇది గుర్తుంచుకొని యువత మెలగాలని అదనపు కలెక్టర్ హితవు పలికారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మత్తు పదార్థాలు సేవించడం వల్ల మనుషులు విచక్షణ కోల్పోయి అనేక నేరాలు చేస్తున్నారని , అనేక కేసులు మత్తు పదార్థాల వలన నమోదు అవుతున్నాయని తెలిపారు.నేటి యువతరం డ్రగ్స్ వాడం, ఇతరులను వాడనీయం, అనే నానుడితో ముందుకు పోతూ మత్తు పదార్థాలు సేవించిన వారి వివరాలు తెలిస్తే 1908 సమాచారం అందించాలని , సైబర్ నేరాలు అరికట్టేందుకు (1930) సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా యువతకు పలు సూచనలు సలహాలు అందించారు. ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి వరప్రసాద్ మాట్లాడుతూ, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు సేవిస్తే మా దృష్టికి తీసుకునిరావలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్,1908, 1933,1446, లకు కాల్ చేసి సమాచారం ఇవ్వమని పేర్కొన్నారు. తదనంతరం గెలుపొందిన విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు,జిల్లా సంక్షేమ శాఖ ఆధికారులు విద్యార్థిని, విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జూన్ 26: అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ జేండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ , జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, కామారెడ్డి జిల్లా ఉన్నత అధికారులు అందరూ, వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు ర్యాలీ లో పాల్గొన్నారు.
డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హితవు పలికారు.
గురువారం జిల్లా సంక్షేమ శాఖ, పోలీస్, మద్య నిషేధ మరియు ఆబ్కారీ శాఖ సమన్వయంతో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్,జిల్లా జడ్జి వరప్రసాద్, సివిల్ జడ్జి శ్రీమతి నాగరాని , అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి , జిల్లా మద్య నిషేద, ఆబ్కారీ అధికారి బి.హనుమంతరావు, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, కామారెడ్డి ఆర్ డి ఒ వీణ, కామారెడ్డి డిఇఒ రాజు, కామారెడ్డి తాసిల్దార్ జనార్దన్ జిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులతో కలిసి సిఎస్ఐ చర్చి నుండి కళాభారతి ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. విద్యార్థులు, అంగన్వాడి టీచర్లు, పోలిస్ సిబ్బంది ఆశా వర్కర్లు, మహిళలు, ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో పాల్గొనగా సిఎస్ఐ చర్చి నుండి కళాభారతి ఆడిటోరియం వరకు డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఉత్సాహభరితంగా కొనసాగింది.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే వచ్చే నష్టాలు, కుటుంబంలో మన తల్లిదండ్రులు, మన కుటుంబీకులు పొందే దుఃఖం అధికంగా ఉంటుందని, చెడు అలవాట్లకు మొదటి నుంచి దూరంగా ఉండాలని తెలిపారు.
నేటి యువత రేపటి భావి భారత పౌరులని, వీరిలో కొంతమంది డ్రగ్స్ కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని, దీనిని గుర్తించి డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన పెంచుకొని దూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
యువత డ్రగ్స్ తో పాటు, గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాలు, సిగరెట్ మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉండాలని, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆలోచనా విధానం ఆలోచన శక్తి నశిస్తాయని అన్నారు.
విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ చాలా కీలకమని, వీటిని ఎట్టి పరిస్థితులలో కోల్పోవద్దని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు తాము కష్టాలు పడుతూ పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పిస్తారని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేసుకోవద్దని, మనం చెడు అలవాట్లకు గురైతే తల్లిదండ్రులు పడే క్షోభ వర్ణనాతీతమని, ఇది గుర్తుంచుకొని యువత మెలగాలని అదనపు కలెక్టర్ హితవు పలికారు.
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మత్తు పదార్థాలు సేవించడం వల్ల మనుషులు విచక్షణ కోల్పోయి అనేక నేరాలు చేస్తున్నారని , అనేక కేసులు మత్తు పదార్థాల వలన నమోదు అవుతున్నాయని తెలిపారు.నేటి యువతరం డ్రగ్స్ వాడం, ఇతరులను వాడనీయం, అనే నానుడితో ముందుకు పోతూ మత్తు పదార్థాలు సేవించిన వారి వివరాలు తెలిస్తే 1908 సమాచారం అందించాలని , సైబర్ నేరాలు అరికట్టేందుకు (1930) సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా యువతకు పలు సూచనలు సలహాలు అందించారు.
ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి వరప్రసాద్ మాట్లాడుతూ, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు సేవిస్తే మా దృష్టికి తీసుకునిరావలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్,1908, 1933,1446, లకు కాల్ చేసి సమాచారం ఇవ్వమని పేర్కొన్నారు.
తదనంతరం గెలుపొందిన విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు,జిల్లా సంక్షేమ శాఖ ఆధికారులు విద్యార్థిని, విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.