జిల్లాలో శృతి మించుతున్న పంచాయతీ సెక్రటరీల వ్యవహారం

భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 28: నిర్మల్ జిల్లా ఉద్యోగులుగా చట్టాలు, నిబంధనలకు లోబడి పని చేయాల్సిన కొందరు అధికారులు, సిబ్బంది తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కాసులకు కక్కుర్తి పడి అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆశయాలకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. మొన్ననే దస్తురాబాద్ మండలంలోని ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలన చిక్కి సస్పెండ్ అయ్యాడు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఒత్తిడి తెస్తున్నారంటూ బుకాయిస్తూ తమ చర్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి నెలా ప్రజలు చెల్లించే పన్నులతో లక్షలాది రూపాయలు వేతనాల రూపంలో తీసుకుంటూనే అడ్డగోలు సంపాదనకు తెరలేపుతున్నారు. అక్కడక్కడ పట్టుబడిన సంఘాలు, యూనియన్ల పేరుతో హడావుడి చేస్తూ పై స్థాయిలో పలుకుబడి ఉపయోగించి చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రం కాలనీలో పని చేసిన ఇరువురు సెక్రటరీలను ఇంటి నంబర్లు కేటాయింపు, ఇతర అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన జిల్లా ఉన్నతాధికారి సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారాన్ని బయటికి పొక్కకుండా ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు గుట్టుగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. మరొక అధికారి కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చినట్లు బుకాయిస్తున్నారు. ఇలా సిబ్బంది తప్పులను కప్పి పుచ్చుతూ పై నుంచి కింది స్థాయి వరకు వాటాలు చేతులు మారుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల దస్తురాబాద్ మండలం గోడిసెర్యాల గ్రామ పంచాయతీ సెక్రెటరీ శివకృష్ణ ఏసీబీకి చిక్కారు. ఏకంగా రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత ఖానాపూర్. రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ జరుపుతున్న దాడుల్లో అధికారులు వరుసగా పట్టుబడుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా దాస్తురాబాద్ మండలం గోడిసెర్యాల గ్రామ పంచాయతీ సెక్రెటరీ శివకృష్ణ ఏసీబీకి చిక్కారు. వాటర్ ప్లాంట్ నిర్మాణానికి అనుమతి కోసం రాజేశం అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి గాను పంచాయతీ కార్యదర్శి రూ. 12వేలు అంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.అధికారులు పక్కా ప్లాన్తో బాధితుడి నుంచి శివకృష్ణ రూ.12 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం పంచాయతీ సెక్రెటరీని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కోర్టుకు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. ప్రభుత్వం పేరు బదలాయింపులు నిలుపుదల చేసినప్పటికీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన ఇందిర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి మ్యుటేషన్ నిర్వహించారు. పైగా ఏజెన్సీ ప్రాంతంలో ఇటువంటి చర్యలకు పాల్పడటం సెక్రటరీల దూక సడుకు అద్దం పడుతోంది. ప్రస్తుత కొందరు సెక్రటరీలు కేవలం ఆఫ్లైన్లోనే రికార్డు చేశామని బుకాయిస్తుండటం గమనార్హం. అయితే ఆన్లైన్లో కాని, ఆఫ్లైన్లో కాని నమోదు చేయడం చట్ట రీత్యా నేరమైనప్పటికీ ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

జిల్లాలో శృతి మించుతున్న పంచాయతీ సెక్రటరీల వ్యవహారం

భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 28: నిర్మల్ జిల్లా ఉద్యోగులుగా చట్టాలు, నిబంధనలకు లోబడి పని చేయాల్సిన కొందరు అధికారులు, సిబ్బంది తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కాసులకు కక్కుర్తి పడి అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆశయాలకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. మొన్ననే దస్తురాబాద్ మండలంలోని ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలన చిక్కి సస్పెండ్ అయ్యాడు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఒత్తిడి తెస్తున్నారంటూ బుకాయిస్తూ తమ చర్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి నెలా ప్రజలు చెల్లించే పన్నులతో లక్షలాది రూపాయలు వేతనాల రూపంలో తీసుకుంటూనే అడ్డగోలు సంపాదనకు తెరలేపుతున్నారు.

అక్కడక్కడ పట్టుబడిన సంఘాలు, యూనియన్ల పేరుతో హడావుడి చేస్తూ పై స్థాయిలో పలుకుబడి ఉపయోగించి చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రం కాలనీలో పని చేసిన ఇరువురు సెక్రటరీలను ఇంటి నంబర్లు కేటాయింపు, ఇతర అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన జిల్లా ఉన్నతాధికారి సస్పెండ్ చేసినట్లు సమాచారం.

అయితే ఈ వ్యవహారాన్ని బయటికి పొక్కకుండా ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు గుట్టుగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. మరొక అధికారి కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చినట్లు బుకాయిస్తున్నారు. ఇలా సిబ్బంది తప్పులను కప్పి పుచ్చుతూ పై నుంచి కింది స్థాయి వరకు వాటాలు చేతులు మారుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల దస్తురాబాద్ మండలం గోడిసెర్యాల గ్రామ పంచాయతీ సెక్రెటరీ శివకృష్ణ ఏసీబీకి చిక్కారు. ఏకంగా రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత ఖానాపూర్. రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ జరుపుతున్న దాడుల్లో అధికారులు వరుసగా పట్టుబడుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా దాస్తురాబాద్ మండలం గోడిసెర్యాల గ్రామ పంచాయతీ సెక్రెటరీ శివకృష్ణ ఏసీబీకి చిక్కారు. వాటర్ ప్లాంట్ నిర్మాణానికి అనుమతి కోసం రాజేశం అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి గాను పంచాయతీ కార్యదర్శి రూ. 12వేలు అంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.అధికారులు పక్కా ప్లాన్తో బాధితుడి నుంచి శివకృష్ణ రూ.12 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం పంచాయతీ సెక్రెటరీని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కోర్టుకు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు.

ప్రభుత్వం పేరు బదలాయింపులు నిలుపుదల చేసినప్పటికీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన ఇందిర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి మ్యుటేషన్ నిర్వహించారు. పైగా ఏజెన్సీ ప్రాంతంలో ఇటువంటి చర్యలకు పాల్పడటం సెక్రటరీల దూక సడుకు అద్దం పడుతోంది. ప్రస్తుత కొందరు సెక్రటరీలు కేవలం ఆఫ్లైన్లోనే రికార్డు చేశామని బుకాయిస్తుండటం గమనార్హం. అయితే ఆన్లైన్లో కాని, ఆఫ్లైన్లో కాని నమోదు చేయడం చట్ట రీత్యా నేరమైనప్పటికీ ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

చదువు "కొంటున్నాం" చదువు "కొంటున్నాం"
చదువుల తల్లిని బహిరంగ మార్కెట్ లో అమ్మేస్తున్న దౌర్భాగ్యం..  న్యాయస్థానాలు అక్షింతలు వేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేదు..  అక్రమ విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వడం చేతులు దులుపుకోవడం.....
ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది

Related Posts