నకిలీ విత్తనాలపై నజర్ ఏది ? -రైతులకు పంటల సీజన్ సమీపిస్తున్న తరుణంలో నాణ్యమైన విత్తనాలు ఏవి?
భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 27: రైతులకు పంటల సీజన్ సమీపిస్తున్న తరుణంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసే దుకాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన వ్యవసాయ అధికారులు ఆ వైపున కన్నెత్తి చూడడం లేదు. పుట్టగొడుగుల వెలుస్తున్న ఫర్టిలైజర్ పెస్టిసైడ్ దుకాణాలలో నిలువ చేస్తున్నటువంటి ఎరువులను విత్తనాలను దుకాణపు యజమానులు మార్కెట్ లోకి వస్తున్నా కొత్త కంపెనీల విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నారు. దుకాణపు యజమానులు రైతులకు అమ్ముతున్న విత్తనాలు నాణ్యమైన కావా అని నిర్ధారించాల్సిన వ్యవసాయ అధికారులు మాత్రం వాటిని చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో దుకాణం యజమానులు ఇస్టారీతిగా పుట్టగొడుగుల వెలుస్తున్న కంపెనీల విత్తనాలను ఎరువులను విక్రయిస్తున్నారు. దీంతో రైతులు పంట చేతికీ వచ్చే సమయంలో విత్తనాలు మొలకెత్తకుండా పోయిన సంఘటనలో అనేకంగా ఉన్నాయి.
గతంలో సైతం జిల్లాలోని ఓ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఒక పెస్టిసైడ్ ఫర్టిలైజర్ షాపు నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్న విత్తనాలను ఓ గ్రామానికి చెందిన ఒక రైతు తీసుకెళ్లి పంటను పండించాడు. మొక్క బాగా పెరిగినప్పటికీ కంకులు సమయంలో ఒక కంకి కూడా రాకపోవడంతో తాను నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసి మోసపోయానని సదరు దుకాణం యజమానిపై గ్రామస్తుల తో కలిసి తనకు నష్టపరిహారం చెల్లించాలని దిగారు. అప్పుడు నాయకులు మధ్యవర్తత్వంగా వ్యవహరించి సదరు దుకాణబుదారుడికి రైతుకి మధ్యల ఒప్పందాన్ని కుదిరించి సమస్యను బహిర్గతం కాకుండా కప్పిపుచ్చారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకే ముందుగా వ్యవసాయ అధికారులు ప్రతి ఫర్టిలైజర్ పెస్టిసైడ్ దుకాణాలను తనిఖీ చేసి రైతులకు న్యాయం నాణ్యమైన విత్తనాలను ఎరువులను అందించే విధంగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.