నేటి భారతం

ఎక్కడ అందరూ ఒక్కటై..
హద్దులు ఎరుగని ప్రేమతో..
చెదరని స్వచ్ఛమైన మనసుతో..
ఐక్యత నిండిన భావంతో..
సమతామమతల విలువలతో..
కులమతాలను కూలద్రోసి..
ధనదాహాన్ని పారద్రోలి..
ద్వేషాలను తరిమి కొట్టి..
స్వార్థాలను పాతిపెట్టి..
అసూయలను అంతంచేసి..
పరుల కష్టానికి నీ స్నేహహస్తాన్ని అందించి..
పనిలో దైవాన్ని నీవెంచి..
పలువురికి మార్గాన్ని సూచించి..
క్షమాగుణాన్ని అనుసరించి..
భేదం లేని పంచ భూతాల్లా..
స్వార్థంలేని సూర్య చంద్రుల్లా..
వివక్షత లేని ప్రకృతిలా..
విలువైన ఆశయాలతో నిత్యం పరవశిస్తారో..
అక్కడ మానవత్వం వికసిస్తుంది..
మంచితనం పరిమళిస్తుంది..
మనిషి మనుగడ సాధ్యం అవుతుంది..
Read More పంచాయితీ ఎన్నికల్లో గంపగుత్త బేరాలు..!
Read More నేటి భారతం :
About The Author
08 Dec 2025
