చెన్నైలో జరిగేది దొంగల ముఠా సమావేశం: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, మార్చి 22(భారత శక్తి): చెన్నైలో జరుగుతున్న సమావేశాన్ని దొంగల ముఠా కలయికనీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. ఆ ముఠా కు నాయకత్వం వహించేది డీఎంకే పార్టీని, తమిళనాడులో అధికారంలో ఉన్న వాళ్ళు వెయ్యి కోట్ల లిక్కర్ స్కాంలో కుకుపోయారని, అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం మీడియాతో మంత్రి పై విధంగా స్పందించారు. అనేక అవినీతి, కుంభకోణాల్లో డీఎంకే కూరుకుపోయి, అక్రమ సంపాదన ను కాపాడుకోవడానికి ఈ దొంగల ముఠాలో బి ఆర్ ఎస్ , కాంగ్రెస్, సిపిఎం, ఆఫ్ పార్టీలను డీఎంకే సభ్యులుగా చేర్చుకుందని ఆరోపించారు. ముఠా లో సభ్యులుగా చేరిన బి ఆర్ ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చేసిన ఆరోపణలు నిజం చేయకుండా తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకేను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారనీ, ప్రజల దారి మళ్లించేందుకే డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని తేలిపోయిందనీ, కేసీఆర్ కుటుంబ అవినీతి కేసులను కాంగ్రెస్ నీరుగారుస్తోందనీ ధ్వజమెత్తారు. 6 గ్యారంటీలపై పోరాడకుండా కాంగ్రెస్ తో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్నారు. చెన్నైలో ఆ రెండు పార్టీలు ఒక్కటైనయని, లిక్కర్ దొంగలంతా ఒక్కటయ్యారనీ వ్యాఖ్యానించారు. చెన్నైలో జరిగేది డీలిమిటేషన్ సమావేశం కాదు… చంబల్ లోయ ముఠా సమావేశమన్నారు. దోచుకున్నది దాచుకోవడానికి, అవినీతి స్కాంల నుండి బయటపడే దానిపైనే ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో సీట్లు తగ్గే ప్రసక్తే ఉండదనీ, ఇంతవరకు గైడ్ లైన్స్ వెలువడనే లేదనీ చెప్పారు. ఆలు లేదు..చూలు లేదు..అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా ప్రతిపక్షాల పరిస్థితి ఉందన్నారు. దక్షిణాదిలో వికసించేది కమలమేనని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యంమన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేననీ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నాకు కేంద్ర మంత్రి బాద్యతలు అప్పగించారనీ చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పై సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మోద్దనీ తెలిపారు. ఆ విషయమై జాతీయ నాయకత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేయడమే క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తల పనన్నారు. పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను కార్యకర్తలతో కలిసి అనేక పోరాటాలు చేశాననీ, రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందనీ చెప్పారు. కేసీఆర్ మళ్లీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఇక కల్ల అన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఫాంహౌజ్ లో గడ్డి పీకుతున్నాడనీ ఆరోపించారు.
కరీంనగర్, మార్చి 22(భారత శక్తి):
చెన్నైలో జరుగుతున్న సమావేశాన్ని దొంగల ముఠా కలయికనీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. ఆ ముఠా కు నాయకత్వం వహించేది డీఎంకే పార్టీని, తమిళనాడులో అధికారంలో ఉన్న వాళ్ళు వెయ్యి కోట్ల లిక్కర్ స్కాంలో కుకుపోయారని, అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం మీడియాతో మంత్రి పై విధంగా స్పందించారు.
అనేక అవినీతి, కుంభకోణాల్లో డీఎంకే కూరుకుపోయి, అక్రమ సంపాదన ను కాపాడుకోవడానికి ఈ దొంగల ముఠాలో బి ఆర్ ఎస్ , కాంగ్రెస్, సిపిఎం, ఆఫ్ పార్టీలను డీఎంకే సభ్యులుగా చేర్చుకుందని ఆరోపించారు. ముఠా లో సభ్యులుగా చేరిన బి ఆర్ ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చేసిన ఆరోపణలు నిజం చేయకుండా తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకేను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారనీ, ప్రజల దారి మళ్లించేందుకే డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని తేలిపోయిందనీ, కేసీఆర్ కుటుంబ అవినీతి కేసులను కాంగ్రెస్ నీరుగారుస్తోందనీ ధ్వజమెత్తారు. 6 గ్యారంటీలపై పోరాడకుండా కాంగ్రెస్ తో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్నారు.
చెన్నైలో ఆ రెండు పార్టీలు ఒక్కటైనయని, లిక్కర్ దొంగలంతా ఒక్కటయ్యారనీ వ్యాఖ్యానించారు.
చెన్నైలో జరిగేది డీలిమిటేషన్ సమావేశం కాదు… చంబల్ లోయ ముఠా సమావేశమన్నారు.
దోచుకున్నది దాచుకోవడానికి, అవినీతి స్కాంల నుండి బయటపడే దానిపైనే ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు.
డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో సీట్లు తగ్గే ప్రసక్తే ఉండదనీ,
ఇంతవరకు గైడ్ లైన్స్ వెలువడనే లేదనీ చెప్పారు.
ఆలు లేదు..చూలు లేదు..అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా ప్రతిపక్షాల పరిస్థితి ఉందన్నారు.
దక్షిణాదిలో వికసించేది కమలమేనని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యంమన్నారు.
బీజేపీ అధికారంలోకి రాగానే పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు.
నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేననీ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నాకు కేంద్ర మంత్రి బాద్యతలు అప్పగించారనీ చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పై సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మోద్దనీ తెలిపారు. ఆ విషయమై
జాతీయ నాయకత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు.
పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేయడమే క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తల పనన్నారు. పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను కార్యకర్తలతో కలిసి అనేక పోరాటాలు చేశాననీ, రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందనీ చెప్పారు.
కేసీఆర్ మళ్లీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఇక కల్ల అన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఫాంహౌజ్ లో గడ్డి పీకుతున్నాడనీ ఆరోపించారు.