దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి…దోషలందరి సంగతి తేలుస్తాం

కరీంనగర్, ఫిబ్రవరి 25(భారత శక్తి): బీజేపీది ఇండియా జట్టయితే పాకిస్తాన్ జట్టు గెలవకున్న సంబురాలు చేసుకునే ఎంఐఎంతో అంటకాగుతున్న కాంగ్రెస్ ది పాకిస్తాన్ జట్టని, ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల మ్యాచ్ లోనూ గెలుపు బీజేపీదే. పాకిస్తాన్ ను చిత్తు చేసి తీరుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 14 నెలల పాలన బాగుందని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునేందుకు సిద్ధమాని సవాల్ విసిరారు. తాము గతంలోనే సవాల్ చేస్తే సీఎం తోకముడిచిన విషయాన్ని గుర్తు చేశారు. మంగళవారం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల శంకర్, కాటేపల్లి వెంకటరమణారెడ్డిలతో కలిసి మంత్రి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ గెలిస్తే పట్టభద్రుల, టీచర్ల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. కుల గణనకు మేం వ్యతిరేకం కానేకాదని, బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణలోనూ ఎప్పటి నుండో దూదేకుల కులాలకు రిజర్వేషన్లు అమలుకు మేం ఏనాడూ అభ్యంతర పెట్టలేదని చెప్పారు. నూటికి 88 మందికిపైగా ముస్లింలను బీసీల్లో కలిపి నిజమైన బీసీల పొట్టకొడతారా?. ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి బిల్లు పంపితే ఎందుకు ఆమోదించాలి? 60 లక్షల మంది బీసీల జనాభా ఎట్లా తగ్గిందో సమాధానం చెప్పాలి. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 56 శాతం జనాభా ఉందని నాటి మంత్రులు కేటీఆర్, హరీష్ అసెంబ్లీలో చెబితే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రభాకర్ రావు, శ్రవణ్ విదేశాలకు పారిపోయారని, మీరు వాళ్లను అరెస్ట్ చేయకుండా పారిపోయేలా చేసిందే కాంగ్రెస్. మీరు విదేశాలకు పంపిస్తే మేం పట్టుకురావాలా? కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని పోలీసులు చెప్పిన తరువాత కూడా ఆయనకు కనీసం నోటీసు కూడా ఎందుకియ్యలేదని ఆరోపించారు. యమునా, గంగా, సబర్మతి ప్రక్షాళనకు అతి తక్కువ ఖర్చుతో చేశారని, కాంగ్రెస్ అగ్రనేత అల్లుడి కోసం రూ.15 వేల కోట్ల ఖర్చయ్యే మూసీ ప్రక్షాళనను రూ.1.5 లక్షలకు పెంచి కమీషన్లు దొబ్బాలనుకుంటే కేంద్రం ఎందుకు సహకరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రెవిన్యూలో అత్యధిక షేర్ హైదరాబాద్ దే…. కానీ ఆదిలాబాద్, ములుగు వంటి వెనుకబడిన జిల్లాలకు అధిక నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది? అట్లని హైదరాబాద్ కు అన్యాయం చేసిందని అనుకోవాలా? అని ప్రశ్నించారు. వరి వేస్తే ఉరేనని కేసీఆర్ అంటే రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి కూడా వరి వేయుద్దు.వేస్తే నష్టపోతారని రైతులను హెచ్చరిస్తున్నారు. మీకు, బీఆర్ఎస్ పాలనకు తేడా ఏముంది? ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడ్డా నీటి కటకట ఎందుకొచ్చింది? మీ అసమర్ధత, పొరుగు రాష్ట్రానికి నీటిని దోచిపెట్టడంవల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రా రెడ్డి, మాజీ మేయర్ వై. సునీల్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి జే. సంగప్పలు పాల్గొన్నారు.

దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి…దోషలందరి సంగతి తేలుస్తాం

కరీంనగర్, ఫిబ్రవరి 25(భారత శక్తి):
బీజేపీది ఇండియా జట్టయితే పాకిస్తాన్ జట్టు గెలవకున్న సంబురాలు చేసుకునే ఎంఐఎంతో అంటకాగుతున్న కాంగ్రెస్ ది పాకిస్తాన్ జట్టని, ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల మ్యాచ్ లోనూ గెలుపు బీజేపీదే. పాకిస్తాన్ ను చిత్తు చేసి తీరుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 14 నెలల పాలన బాగుందని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునేందుకు సిద్ధమాని సవాల్ విసిరారు. తాము గతంలోనే సవాల్ చేస్తే సీఎం తోకముడిచిన విషయాన్ని గుర్తు చేశారు. మంగళవారం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల శంకర్, కాటేపల్లి వెంకటరమణారెడ్డిలతో కలిసి మంత్రి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ గెలిస్తే పట్టభద్రుల, టీచర్ల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు.
కుల గణనకు మేం వ్యతిరేకం కానేకాదని, బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణలోనూ ఎప్పటి నుండో దూదేకుల కులాలకు రిజర్వేషన్లు అమలుకు మేం ఏనాడూ అభ్యంతర పెట్టలేదని చెప్పారు. నూటికి 88 మందికిపైగా ముస్లింలను బీసీల్లో కలిపి నిజమైన బీసీల పొట్టకొడతారా?. ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి బిల్లు పంపితే ఎందుకు ఆమోదించాలి? 60 లక్షల మంది బీసీల జనాభా ఎట్లా తగ్గిందో సమాధానం చెప్పాలి. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 56 శాతం జనాభా ఉందని నాటి మంత్రులు కేటీఆర్, హరీష్ అసెంబ్లీలో చెబితే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రభాకర్ రావు, శ్రవణ్ విదేశాలకు పారిపోయారని, మీరు వాళ్లను అరెస్ట్ చేయకుండా పారిపోయేలా చేసిందే కాంగ్రెస్. మీరు విదేశాలకు పంపిస్తే మేం పట్టుకురావాలా? కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని పోలీసులు చెప్పిన తరువాత కూడా ఆయనకు కనీసం నోటీసు కూడా ఎందుకియ్యలేదని ఆరోపించారు.
యమునా, గంగా, సబర్మతి ప్రక్షాళనకు అతి తక్కువ ఖర్చుతో చేశారని, కాంగ్రెస్ అగ్రనేత అల్లుడి కోసం రూ.15 వేల కోట్ల ఖర్చయ్యే మూసీ ప్రక్షాళనను రూ.1.5 లక్షలకు పెంచి కమీషన్లు దొబ్బాలనుకుంటే కేంద్రం ఎందుకు సహకరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రెవిన్యూలో అత్యధిక షేర్ హైదరాబాద్ దే…. కానీ ఆదిలాబాద్, ములుగు వంటి వెనుకబడిన జిల్లాలకు అధిక నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది? అట్లని హైదరాబాద్ కు అన్యాయం చేసిందని అనుకోవాలా? అని ప్రశ్నించారు.
వరి వేస్తే ఉరేనని కేసీఆర్ అంటే రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి కూడా వరి వేయుద్దు.వేస్తే నష్టపోతారని రైతులను హెచ్చరిస్తున్నారు. మీకు, బీఆర్ఎస్ పాలనకు తేడా ఏముంది? ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడ్డా నీటి కటకట ఎందుకొచ్చింది? మీ అసమర్ధత, పొరుగు రాష్ట్రానికి నీటిని దోచిపెట్టడంవల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రా రెడ్డి, మాజీ మేయర్ వై. సునీల్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి జే. సంగప్పలు పాల్గొన్నారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

చదువు "కొంటున్నాం" చదువు "కొంటున్నాం"
చదువుల తల్లిని బహిరంగ మార్కెట్ లో అమ్మేస్తున్న దౌర్భాగ్యం..  న్యాయస్థానాలు అక్షింతలు వేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేదు..  అక్రమ విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వడం చేతులు దులుపుకోవడం.....
ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది

Related Posts