CSK vs RR Toss: టాస్ నెగ్గిన రాజస్థాన్.. మోత మోగించడం ఖాయం!

చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మొదలైపోయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ నెగ్గిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. దీంతో ధోని సేన మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ఇతర మైదానాలతో పోల్చుకుంటే అరుణ్ జైట్లీ స్టేడియంలో బౌండరీ సైజ్ తక్కువ. కాబట్టి చేజింగ్ చేయాలనే ఉద్దేశంతో సంజూ మొదట బౌలింగ్ ఎంచుకోవచ్చు. కానీ బిగ్ స్కోర్ సెట్ చేసి ఇస్తే సీఎస్‌కేను మరింత ఒత్తిడిలోకి నెట్టేందుకు అవకాశం ఉండేది. అసలే ఈ సీజన్ మొత్తం చేజింగ్‌లో ఇబ్బందులు పడుతూ వచ్చింది ధోని సేన. సరైన ఫినిషర్లు లేకపోవడం, ఉన్న బ్యాటర్లూ ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడటంలో ఫెయిల్ అవడం ఆ టీమ్‌కు మైనస్‌గా మారింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ బౌలింగ్ చేయాలని డిసైడ్ అవడం కొంత ఆశ్చర్యకరమనే చెప్పాలి. దంచి కొడతారా? టాస్ ఓడిన చెన్నైకి తమ బ్యాటింగ్ పవర్‌ను నిరూపించేందుకు ఇదే బెస్ట్ చాన్స్ అని చెప్పాలి. ఓపెనర్లు ఆయుష్ మాత్రే, డెవిన్ కాన్వే దగ్గర నుంచి శివమ్ దూబె వరకు బిగ్ నాక్స్ ఆడాల్సిన సమయమిది. సీజన్ ఎలాగూ పోయింది కాబట్టి ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఫియర్‌లెస్ అప్రోచ్‌తో ఆడాలి. బౌండరీ సైజ్ చిన్నదే కాబట్టి భారీ షాట్లతో విరుచుకుపడాలి. ఒకవేళ ఎల్లో ఆర్మీ గనుక చెలరేగి ఆడితే మ్యాచ్ రసవత్తరంగా మారొచ్చు. ఎందుకుంటే ప్రత్యర్థి జట్టులో సూర్యవంశీ దగ్గర నుంచి హిట్‌మెయిర్ వరకు చాలా మంది పించ్‌‌హిట్టర్లు ఉన్నారు. మరి.. సీఎస్‌కే ఎలా బ్యాటింగ్ చేస్తుందో చూడాలి.

CSK vs RR Toss: టాస్ నెగ్గిన రాజస్థాన్.. మోత మోగించడం ఖాయం!

చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మొదలైపోయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ నెగ్గిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. దీంతో ధోని సేన మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ఇతర మైదానాలతో పోల్చుకుంటే అరుణ్ జైట్లీ స్టేడియంలో బౌండరీ సైజ్ తక్కువ. కాబట్టి చేజింగ్ చేయాలనే ఉద్దేశంతో సంజూ మొదట బౌలింగ్ ఎంచుకోవచ్చు. కానీ బిగ్ స్కోర్ సెట్ చేసి ఇస్తే సీఎస్‌కేను మరింత ఒత్తిడిలోకి నెట్టేందుకు అవకాశం ఉండేది. అసలే ఈ సీజన్ మొత్తం చేజింగ్‌లో ఇబ్బందులు పడుతూ వచ్చింది ధోని సేన. సరైన ఫినిషర్లు లేకపోవడం, ఉన్న బ్యాటర్లూ ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడటంలో ఫెయిల్ అవడం ఆ టీమ్‌కు మైనస్‌గా మారింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ బౌలింగ్ చేయాలని డిసైడ్ అవడం కొంత ఆశ్చర్యకరమనే చెప్పాలి.

దంచి కొడతారా?

టాస్ ఓడిన చెన్నైకి తమ బ్యాటింగ్ పవర్‌ను నిరూపించేందుకు ఇదే బెస్ట్ చాన్స్ అని చెప్పాలి. ఓపెనర్లు ఆయుష్ మాత్రే, డెవిన్ కాన్వే దగ్గర నుంచి శివమ్ దూబె వరకు బిగ్ నాక్స్ ఆడాల్సిన సమయమిది. సీజన్ ఎలాగూ పోయింది కాబట్టి ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఫియర్‌లెస్ అప్రోచ్‌తో ఆడాలి. బౌండరీ సైజ్ చిన్నదే కాబట్టి భారీ షాట్లతో విరుచుకుపడాలి. ఒకవేళ ఎల్లో ఆర్మీ గనుక చెలరేగి ఆడితే మ్యాచ్ రసవత్తరంగా మారొచ్చు. ఎందుకుంటే ప్రత్యర్థి జట్టులో సూర్యవంశీ దగ్గర నుంచి హిట్‌మెయిర్ వరకు చాలా మంది పించ్‌‌హిట్టర్లు ఉన్నారు. మరి.. సీఎస్‌కే ఎలా బ్యాటింగ్ చేస్తుందో చూడాలి.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

చదువు "కొంటున్నాం" చదువు "కొంటున్నాం"
చదువుల తల్లిని బహిరంగ మార్కెట్ లో అమ్మేస్తున్న దౌర్భాగ్యం..  న్యాయస్థానాలు అక్షింతలు వేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేదు..  అక్రమ విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వడం చేతులు దులుపుకోవడం.....
ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది

Related Posts