ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ పైజాన్ అహ్మద్.

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 11: నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని పెండ్పల్లి గ్రామంలో సోమవారం నుంచి జిల్లాలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు ఈనెల 15వ తేదీ వరకు అధికారులు నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా, సోమవారం పెండ్పల్లి గ్రామంలో పలు కాలనీలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా సంఘాల మహిళలు రోడ్లపై చెత్తను తొలగించారు. పారిశుద్ధ్య కార్మికులు మురికి కాలువల్లోని చెత్తను తొలగించి శుభ్రం చేశారు. మురికి కాలువల వెంబడి ఆయా వార్డుల్లో పరిశుద్ధం పై ప్రజలకు అవగాహన కలిగే ర్యాలీలను నిర్వహించారు. వార్డు ప్రజలతో అధికారులు మాట్లాడుతూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను వివరించారు. ఇండ్లలో తప్పనిసరిగా తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల వ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మరియు అంగన్వాడి సెంటర్లో పిల్లలతో కలిసి ఉపాధ్యాయులు నేర్పిస్తున్న పాటలను పిల్లలతో కూర్చొని పాటలు విన్నారు మరియు పిల్లలతో పలు వాక్యాలు చదివించారు. పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా చదువుతున్నారని ఇక్కడ చదువుతున్న గురువులకు అభినందించారు. మరియు మధ్యాహ్నం భోజనం పిల్లలతో కలిసి భోజనం చేశారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ మెనూ ప్రకరంగా అందిస్తున్న మధ్యాహ్నం భోజనం చాలా రుచికరంగా ఉందని వంట చేసే వాళ్లకు అభినందించారు. అలాగే ప్రతిరోజు పిల్లలకు రుచికరమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ. ఎంపీడీవో. ఎంపీ ఓ.మొహమ్మద్ మోజమ్ హుస్సేన్. ఏపీఓ శివలింగం. గ్రామపంచాయతీ స్పెషల్ అధికారి అరుణ్ కుమార్. పంచాయతీ సెక్రెటరీ కవిత వివిధ అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About The Author