మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం గురించి సందేశం ఇచ్చిన జిల్లా కలెక్టర్

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం గురించి సందేశం ఇచ్చిన జిల్లా కలెక్టర్

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జులై 23: తెలంగాణ రాష్ట్రములో అమలవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయాణించిన 200 కోట్ల మహిళా ప్రయాణికులు, సుమారు 6700 కోట్ల రూపాయలు తేది 23 జూలై 2025 నాటికి ఆదా చేసుకున్న సందర్భంలో బుధవారం కామారెడ్డి బస్సు స్టేషన్ లో జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిధిగా విచ్చేసి, మహాలక్ష్మి ఉచిత ప్రయాణం గురించి సందేశం ఇచ్చినారు. సమావేశంలో డి.ఎం, శ్రీమతి కరుణ శ్రీ కామారెడ్డి అధ్యక్షత వహించారు. రోజు ఉచిత ప్రయాణం చేసే మహిళా ప్రయాణికులలకు బహుమతులతో పాటు శాలువాతో సన్మానించారు. స్కూల్ విద్యార్థుల చే ముగ్గుల పొటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేసినారు. వీటితో పాటు ఆరు స్పెషల్ టూర్ ప్యాకేజీ కర పత్రాలను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర, ఎ ఎస్పీ కుమారీ చైతన్య రెడ్డి, ఆర్డిఓ వీణ,  డిపో సూపర్వైజర్స్, సిబ్బంది పాల్గొన్నారు.

IMG_20250724_212759

Read More ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఇసుక రవాణా 

About The Author