ఘనంగా దీపావళి పర్వదిన వేడుకలు

జిన్నారం :

WhatsApp Image 2025-10-21 at 6.53.22 PM

జిన్నారం మున్సిపాలిటీలో సోమవారం దీపావళి పర్వదిన వేడుకలను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపార సముదాయాలతో పాటు గృహాలలో కాంతులు వెదజల్లేలా దీపాలను ఏర్పాటు చేశారు. అనంతరం  సాంప్రదాయబద్ధంగా దొంతుల కొలువు ఏర్పాటు చేసి...లక్ష్మీదేవిని కొలుస్తూ కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటి ముంగిళ్ళలో పూలతో రంగవల్లుల మధ్యన ప్రమిదలు వెలిగించారు. సకల శుభాలను కలిగించాలంటూ లక్ష్మీదేవిని వేడుకున్నారు. అనంతరం తీపి పాయసాలను ఆరగించి, పిల్లలు పెద్దలు టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. టపాకాయల శబ్దాలతో జిన్నారం మున్సిపాలిటీలోని అన్ని గ్రామాలు దద్దరిల్లిపోయాయి. ప్రతి ఇంటా దీపావళి వెలుగులతో శోభాయ మానంగా మారాయి.

Read More అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

About The Author