తెలంగాణ స్ఫూర్తిని జ్వలింపజేసిన మహనీయుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు

తెలంగాణ స్ఫూర్తిని జ్వలింపజేసిన మహనీయుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు

సూర్యపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 22:
నా తెలంగాణ కోటి రత్నాలవీణ నినాదంతో ప్రజలలో తెలంగాణ స్ఫూర్తిని జ్వలింపజేసిన మహనీయుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు అని పూర్వ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ న్యాయవాది జె. శశిధర్ అన్నారు. మంగళ వారం దాశరథికృష్ణమాచార్యుల జయంతి సందర్బంగా వివేక ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్పందన డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొనిప్రసంగించారు శ్రామికుల, అణగారిన వర్గాలకోసం నవ సమాజానికై పరితపించిన మహోన్నతమైన వ్యక్తి అని ఆయన నేటి సమాజానికి ఆదర్శనీయుడని కొనియాడారు.

ఈకార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన వివేక ఫౌండేషన్ అధ్యక్షులు తీకుళ్ళ సాయిరెడ్డి మాట్లాడుతూ 1947 లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికి, తెలంగాణలో మాత్రం నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల ఆరాచకాలతో ప్రజలను నానా ఇబ్బందులకు గురించేస్తున్నసమయంలో రజాకార్లకు వ్యతిరేకంగా తన రచనల ద్వారా ప్రజా చైతన్యం కలిగించి, జైలుజీవితం గడిపిన మహనీయుడు దాశరథి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో స్పందన డిగ్రీ కళాశాల డైరెక్టర్స్ అచ్యుతరామశర్మ, తీగల వేణు, వివేక ఫౌండేషన్ ఉపాధ్యక్షులు శేరి శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, భాషపంగు సునీల్, ధనుంజయ చారి, అశోక్ తదితరులు పాల్గొని పుష్పాంజలి గడించారు.

Read More సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్.

About The Author