ప్రతి అడుగు ప్రజా సమస్యల పరిష్కారం

అభివృద్ధి వైపు, ప్రజల సౌకర్యం కోసం నిరంతరం శ్రమ.

ప్రతి అడుగు ప్రజా సమస్యల పరిష్కారం

రంగారెడ్డి జిల్లా, జూలై 18 (భారత శక్తి ప్రతినిధి):
అభివృద్ధే లక్ష్యంగా మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని విజయశ్రీ కాలనీలో జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి కాలనీలోని గల్లీ గల్లీ తిరుగుతూ, స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా పాదయాత్ర చేస్తూ వారు ఎదుర్కొంటున్న నిత్యజీవన సమస్యలపై విన్నవింపులు స్వీకరించి, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. త్వరలోనే కాలనీ కమిటీ హాల్ మీద యోగ షెడ్ వేయడం జరుగుతుందని ప్రాధాన్యతతో చేపట్టాల్సిన సి సి రోడ్ల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, చెట్ల కొమ్మలను ట్రిమ్మింగ్, కాలనీలో రోడ్డుకు ఎన్ క్రోచ్ అయిన రాంపులు తొలగింపు తదితర అంశాలపై సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తానని వారికి తెలిపారు.

Read More మూసీ న‌ది గ‌ర్భంలో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు

కాలనీ సంక్షేమ సంఘం ఒక మంచి ఆలోచనతో కాలనీలో ఖాళీగా ఉన్న ప్లాట్ లలో చెత్త వెయ్యకుండా బ్యానర్ ఆకర్షణీయంగా ఉందని డివిజన్లో మిగతా కాలనీ వాళ్లు ఆదర్శంగా తీసుకొని ఇటువంటి బ్యానర్లు చేపట్టి చెత్త నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సిరెడ్డి, వెంకట్ రెడ్డి , రాజేష్, జంగయ్య యాదవ్, మధుసూదన్ రెడ్డి, నర్సింహరెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, ఎల్ ఎన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మాచారి, సతీష్, లింగస్వామి యాదవ్, యాది రెడ్డి, వెంకటేష్ గౌడ్, రాజేశ్వర్ రెడ్డి, రుద్ర రెడ్డి, మహేందర్ రెడ్డి, విష్ణుమూర్తి, వెంకట్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రాజు, ఐలయ్య, బాలకోటి, శ్రీనివాన్ పాల్గొన్నారు.

Read More ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం..

About The Author