చీఫ్ సెక్రటరీ శ్రీ కె. రామకృష్ణారావు ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.
ఉమ్మడి ఆదిలాబాద్ :
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంటలు, ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం – ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీ కే. రామకృష్ణా రావు ని కలిసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు ని మర్యాదపూర్వకంగా కలిసి నిర్మల్ జిల్లాలో వరద నష్టాన్ని వివరించిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల కారణంగా రైతులు కష్టాల్లో ఉన్నారని, పంటలు పూర్తిగా మునిగిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయారని, పలు గ్రామాల్లో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని, ప్రజలకు ప్రభుత్వం నుండి తక్షణ సాయం అందించాలని వివరించారు.
ప్రత్యేకంగా నష్టపోయిన ప్రతి రైతు పంటను సక్రమంగా అంచనా వేయించి, నీట మునిగిన పంటలకు సరైన లెక్కలు వేసి, వారికి తగిన నష్టపరిహారం త్వరగా చెల్లించాల్సిందిగా చీఫ్ సెక్రటరీని విన్నవించారు. అదే విధంగా వరదల్లో ఆస్తి నష్టం జరిగిన వారికి కూడా తగిన సాయం అందించాలని కోరారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాలలో భారీ మొత్తంలో నష్టం జరిగిందన్నారు. వ్యవసాయ రంగం పెద్ద మొత్తంలో నష్టపోయిందని పేర్కొన్నారు.
సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నిర్మల్ జిల్లా రైతులకు అండగా ఉండాలని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. ఆయన వెంట పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి,లోక భూమారెడ్డి, శ్యాం నాయక్, ఆయిర నారాయణరెడ్డిలు తదితరులు ఉన్నారు .