యూరియా దోపిడీ అరికట్టాలి : సీపీఐ

పోరుమామిళ్ళ : 


WhatsApp Image 2025-09-08 at 6.44.19 PM

Read More జిల్లాలో రామకృష్ణ మట్ ఆధ్వర్యంలో లింగంపేట మండలంలోని పోల్కంపేట్ రైతువేదికలో మెడికల్ క్యాంప్

రాష్ట్రంలో యూరియా కొరత తీర్చా లని, ఎరువుల కేటాయింపులోరైతు సేవాకేంద్రాలు,ప్రాథమికవ్యవసాయ సహకార సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అధిక ధరలకు విక్రయించే డీలర్ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ మండలకార్యదర్శి.
రవికుమార్, సహాయ కార్యదర్శి కేశవలు డిమాండ్ చేశారు. సోమవారం పోరుమామిళ్ల మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ పార్టీ నేతలు యూరియా కొరతను అరి కట్టి,రైతులకు అరికట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం.లో ఎరువుల కొరత పర్యావసానం యూరియా అందుబాటులో లేకపో వడం వల్ల రైతులు అనేక ఇబ్బందు లు పడుతున్నారు గతేడాది ఇదే సీజన్లో ఎటువంటియూరియాకొరత సమస్యరాలేదన్నారు.ఈసంవత్స.రం మాత్రమే యూరియా సమస్య తీవ్రంగా ఉందన్నారు..రాష్ట్రప్రభుత్వం మాత్రం యూరియా నిలవలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ రైతు లకు అందంటం లేదన్నారు.కేంద్ర నుంచి వచ్చిన యూరియాను 80 శాతం ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపులకు తరలిస్తున్నారన్నారు.20శాతంమాత్రమే రైతు సేవా కేంద్రాలకుప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సరఫరా చేస్తున్నారు. ఈ యూరియాను కూడా స్థానికకూటమి నాయకులు అవసరానికి మించి తీసు కుపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు.రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రవేట్ ఫెర్టిలైజర్ షాప్ల వారు ఒక బస్తా యూరియా (45 కేజీలు) 266రూపాయల కు అమ్మా లసి ఉండగా బ్లాక్ మార్కెట్లో300 నుంచి 400 వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారన్నారు. యూరియా కావాలంటే అవసరం లేని ఎరు వులను కొనుగోలు చేయాలని రైతులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. సమీక్షలకు మాత్రమే పరిమితమవుతున్నది. వరి పంటకు కనీసం ఖరీఫ్ సీజన్లో ఎకరానికి రెండుబస్తాలుయూరియా అవసరం ఉంటుంది. కానీ ఒక బస్తా కూడా అందలేదు. పైగా  సంవత్సరం సాగు విస్తరణ తగ్గిందన్నారు. రాయలసీమ ప్రాంతాల్లో వేరుశనగ సుమారు 13 లక్షల ఎకరాల సాగు కావలసి ఉండగా కేవలం 4.24 ఎకరాల్లో మాత్రం సాగైందన్నారు. కేసీ కెనాల్, మైలవరం ఆయకట్టు, 

Read More రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎలక్షన్ గోడౌన్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్..

వరి సాగు చేసే ప్రాంతాలు. రైతులు యూరియా కోసం రైతు సేవ కేంద్రాల వద్దకు పోతే ఒక ఆధార్ కార్డుకు ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని రైతులు వాపోతున్నారన్నా రు,పోనీ డీలర్ల వద్ద యూరియా కొందామంటే యూరియాతో పాటు ఇతర ఎరువులు కొనాలన్న షరతులుపెట్టి అధిక ధర పెట్టాల్సి వస్తోందన్నారు.

Read More నేటి భారతం :

యూరియా కొరత తీర్చాలని, ఎరువు.ల కేటాయింపులో రైతు సేవాకేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అధిక ధరలకు విక్రయించే డీలర్ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయా లని డిమాండ్ చేశారు. అనంతరం వారు డిప్యూటి తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.bఈకార్యక్రమంలో సీపీఐ, ఎఐటియుసి నాయకు లు పీరయ్య, శ్రీనివాసులు,చెన్నయ్య, రంగాచారి,గురమ్మ,జ్యోతి,ఆదేమ్మ,విశ్వాసమ్మ,షాహిదా తదితరులు పాల్గొన్నారు.,

Read More నేటి భారతం :

About The Author