ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలి..

గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. విజయపాల్ రెడ్డి

కామారెడ్డి : 

WhatsApp Image 2025-09-10 at 5.58.53 PM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని  గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. విజయపాల్ రెడ్డి  పాల్వంచ మండలంలోని ఇస్సాయిపేట్, పాల్వంచ గ్రామాలలో, మాచారెడ్డి మండలంలోని లక్ష్మీరావులపల్లి గ్రామంలోని వివిధ నిర్మాణ దశలలో,  నిర్మాణంలో ఉన్న ఇండ్లను పరిశీలించి లబ్ధిదారులకు ఇందిరమ్మ కమిటీ మెంబర్లకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమునకు సంబంధించి పూర్తి అవగాహన కల్పించినారు. వారి యొక్క సందేహములను నివృత్తి పరిచారు. ఇట్టి కార్యక్రమంలో లబ్ధిదారులకు వారు స్వయంగా స్టేజి ఫోటోలను అప్లోడ్ చేయు వివరములను, లబ్ధిదారులు ఏదైనా వివరములు, సమస్యలు విన్నవించుటకై ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18005995991 గూర్చి వివరించడం జరిగింది. ఇట్టి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమునకు సంబంధించి అవసరమగు  ఇసుకను ప్రభుత్వం సంబంధిత మండల రెవెన్యూ అధికారి ద్వారా లబ్ధిదారులు ట్రాక్టర్ కిరాయి, లేబర్ ఏర్పాటు చేసుకొని ఉచితంగా సరఫరా చేయబడుటకు వివరములను తెలియజేసినారు. ఇట్టి గృహ నిర్మాణములకు సంబంధించి ఎవరికిని ఎలాంటి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని, ఇవ్వకూడదని తెలియజేయడం జరిగినది. లబ్ధిదారులు తమకు సంబంధించిన వివరాలను ఇందిరమ్మ వెబ్సైట్లో స్వయంగా తెలుసుకోవచ్చునని ఇందిరమ్మ ఇండ్ల ప్రభుత్వ వెబ్సైట్ గురించి తెలియజేసినారు. 

Read More 111 జీఓ పరిధిలో అక్రమ నిర్మాణాలు..

ఇట్టి పర్యటనలో భాగంగా పాల్వంచ మండలములో నిర్మించినటువంటి నమూనా గృహమును సందర్శించి లబ్ధిదారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు తక్కువ ఖర్చుతో దృఢంగా ఇంటి నిర్మాణం చేసుకొనుటకు అవగాహన కల్పించినారు. 
ఈ కార్యక్రమంలో వై సుభాష్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (హౌసింగ్), ఎం శ్రీనివాస్, ఏ ఈ (హౌసింగ్), ఎంపీడీవో లు పాల్వంచ, మాచారెడ్డి, సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Read More 10న స్థానిక సంస్థల తుది ఓటరు జాబితా.

About The Author