ఎన్‌హెచ్ - 44, సదాశివనగర్ లిమిట్స్ లో స్పీడ్ లేజర్ గన్స్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..

కామారెడ్డి : 

WhatsApp Image 2025-09-08 at 6.05.23 PM

ప్రజల ప్రాణాలను కాపాడేందుకే  వేగ నియంత్రణ ఏర్పాట్లు - నిబంధనలు ఉల్లంఘించిన వారికి స్పీడ్ లేజర్ గన్స్ ద్వారా చాలనాలు జారీ, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న భద్రతా చర్యలు, కట్టుదిట్టమైన నిబంధనల అమలు ఫలితంగా ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది.

Read More 10న స్థానిక సంస్థల తుది ఓటరు జాబితా.

2024 ఆగస్టు వరకు జిల్లాలో మొత్తం 188 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, 2025 ఆగస్టు వరకు వాటిని 145కి తగ్గించగలిగాం. దీని ద్వారా మొత్తం 22.9% తగ్గుదల నమోదైంది. అదేవిధంగా మరణాలు 197 నుండి 153కి తగ్గి 22.3% తగ్గుదల ఉన్నది. అలాగే గాయపడ్డ కేసులు కూడా  181 నుండి 173కి తగ్గగా, గాయపడిన వ్యక్తులు 355 నుండి 298కి తగ్గడం ద్వారా రోడ్డు ప్రమాదాల నియంత్రణలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఇది జిల్లా స్థాయిలో రోడ్డు భద్రతా చర్యల విజయాన్ని సూచిస్తూ, ప్రజల ప్రాణ రక్షణలో ఒక గొప్ప ముందడుగుగా నిలిచింది.

Read More బీర్కూర్ తండా నుండి తెలంగాణ తిరుపతి దేవస్థానంకు వెళ్లే దారి మరమ్మతులు..

రోడ్డు ప్రమాదాల తగ్గుదలకు ప్రధాన కారణాలు ప్రతిరోజూ వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్‌లు, హెల్మెట్ & లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు, అతివేగంగా ప్రయాణించే వారిపై జరిమానాలు విధించడం అని  జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్, సదాశివనగర్, ఎన్‌హెచ్-44 వద్ద అయ్యప్ప ఆలయం సమీపంలో స్పీడ్ లేజర్ గన్స్ ను ప్రారంభించారు. జిల్లాలో మొత్తం మూడు స్పీడ్ లేజర్ గన్స్ వాహనదారుల  వేగాన్ని నియంత్రించడం కొరకు పనిచేస్తున్నవి.   అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి జరిమానాలు విధించి క్రమంగా వారి వాహణముల వేగనియంత్రణ చేయడం, తద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన ఉద్దేశం.  ఇకపై ఈ లేజర్ గన్స్ జాతీయ రహదారి (ఎన్ హెచ్-44), జాతీయ రహదారి (ఎన్ హెచ్-161), రాష్ట్ర రహదారులపై ఉండును. 

Read More వికలాంగులకు, చేయూత పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలి

రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా మీ ప్రాణాన్ని, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోండి” అని జిల్లా పోలీసు శాఖ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.. 

Read More జీవితం ఒక వింత నాటకం… ఒక్కో మనిషిది, ఒక్కో గాధ

About The Author