రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎలక్షన్ గోడౌన్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్..

కామారెడ్డి :

WhatsApp Image 2025-09-09 at 5.57.15 PM

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు  త్రైమాక్షిక  తనిఖీలో భాగంగా  మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  జిల్లా కేంద్రంలోని ఎలక్షన్ గోడౌన్  ను పరిశీలించారు. సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎలక్షన్ గోడౌన్ లో ఈవీఎంలను భద్రపరిచిన గదులను తెరిచి  ఇవియం బాక్స్లను  పరిశీలించి మళ్లీ గదులను సీల్ చేశారు. 
 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు  త్రైమాక్షి తనిఖీల్లో భాగంగా  ఈవీఎం గోడౌన్ లో రక్షణ చర్యలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో  పరిశీలించడం జరిగిందని, అన్ని రక్షణ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని  తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట  కామారెడ్డి ఆర్డిఓ వీణ, తాసిల్దార్ జనార్ధన్, ఎలక్షన్ డిటీ అనిల్, రాజకీయ పార్టీల ప్రతినిధులు  జాకంటి ప్రభాకర్ బిఆర్ఎస్, సంతోష్ రెడ్డి బిజెపి, కసిం అలీ టిడిపి, హరిలాల్ బిఎస్పి, శ్రీకాంత్ కాంగ్రెస్ తదితరులు పాల్గొన్నారు.

Read More సాటి లేని తొలి తెలుగు సినీ కళాకారిణి శ్రీమతి భానుమతి

About The Author