రెవెన్యూ శాఖలో మార్పు ఎప్పుడు..? రైతు రోదన తీరేది ఎప్పుడు..?

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )

- అడుగడుగునా అవినీతి అధికారులే.. 
- అన్నం పెట్టే రైతుల కడుపు కొడుతున్నారు.. 
- ఎవరి భూమి ఎవరి పరం అవుతుందో తెలియని సంక్షోభం.. 
- అధికారులు ఒక వైపు, ప్రకృతి ఒకవైపు పగబడుతూనే ఉన్నారు.. 
- రైతును రాజును చేస్తామని చెప్పడం తప్ప ఒరగబెట్టింది ఏమీ లేదు.. 
- అధిక రాబడి రైతులకు కాదు.. రెవెన్యూ శాఖ అవినీతి అధికారులకు.. 
- సమస్య వస్తే రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న దుర్మార్గం.. 
- అసలే అప్పుల్లో కూరుకుపోతున్న రైతన్న లంచాలివ్వగలడా..?
- అటు చావలేక, ఇటు బ్రతకలేక జీవచ్ఛవాల్లా మిగులుతున్నారు.. 
- రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరిగితే తప్ప రైతు బాగుపడడు.. 
- వందల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం.. 
- భూ యజమాని ఒకరైతే.. రికార్డుల్లో మరొకరి పేరు.. 
- రైతులకు ఉరిలా మారుతున్న అధునాతన పోర్టర్లు.. 
- రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టిపెట్టాలని డిమాండ్ చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 

WhatsApp Image 2025-09-10 at 5.30.28 PM

అత్యంత ప్రతిష్టాత్మకమైన రెవెన్యూ శాఖ అవినీతి కంపుతో నిండిపోయింది.. అన్నం పెట్టే రైతన్నల కడుపు కొడుతోంది.. అత్యధిక ఆదాయం కలిగిన రెవెన్యూ శాఖ  అవినీతి అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది.. ఫైల్ కదలాలంటే లంచం.. పని జరగాలంటే లంచం.. సమస్య తీరాలంటే లంచం.. ఇలా లంచావతారాలు రెవెన్యూ శాఖలో కుప్పలు కుప్పలుగా పేరుకునిపోయారు..రెవెన్యూ అంటేనే ఆదాయం..  కానీ ఎవరికీ దక్కుతోంది ఈ ఆదాయం..? రైతులకు, ప్రభుత్వాలకు దక్కాల్సిన ఆదాయం పక్కదారి పడుతోంది.. అధికారులు కోట్లు  వెనుకేసుకుంటుంటే.. రైతులు మాత్రం కన్నీళ్లు నింపుకుంటున్నారు.. ప్రభుత్వాల పనితీరు ఒకవైపు.. అధికారుల అవినీతి మరోవైపు.. కార్పొరేట్ సంస్థల దోపిడీ ఇంకోవైపు.. రాక్షసుల్లా రైతులను పీక్కుతింటున్నాయి.. ఒక ప్రభుత్వ ఆదేశిస్తే ఆఘమేఘాల మీద పరుగులు తీసే  అధికారగణం.. ఒక రైతు ఏదైనా చిన్న పనికోసం ఆఫీసులో అడుగుపెడదామంటే.. గేటు దగ్గరే ఆపేస్తున్నారు..  రైతు సంక్షేమం, రైతు భరోసా అంటూ రంకెలు వేసే ప్రభుత్వ పెద్దలు కార్యాచరణలో చూపించడం లేదు.. రైతుల కోసం ప్రాజెక్టులు అంటూ..  కోటాను కోట్లు దోచుకుంటున్నారు.. ఉన్నతమైన రెవెన్యూ శాఖ మకిలిపట్టిపోయింది.. డిపార్ట్మెంట్ లో పనిచేసే వారికి కనీసం వారానికి ఒక్కరోజైనా సెలవు ఉంటుంది..  కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తారు.. రైతు అలాకాదు సంవత్సరం రోజులు 24 గంటలు పనిచేయాల్సిందే..  అయినా సరే నాలుగు వేళ్ళు నోట్లోకి పోవడం లేదు.. ఒక పూట తింటే ఒక పూట పస్తులుండాల్సిందే.. రైతులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన రెవిన్యూ శాఖ  రక్షణ మాట అటుంచి.. భక్షించడం మొదలుపెట్టింది.. ఇది ఎంతమాత్రం వాంఛనీయం కాదు..            

Read More పార్వతి తనయా వెళ్లిమళ్లీరావయ్యా...!

తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ అనే పేరు వినగానే ప్రజల్లో కలిగే భావన ఒక్కటే.. లంచం లేనిదే  పని జరగదు. భూమి రికార్డులు, మ్యూటేషన్, పాస్‌బుక్, వారసత్వ హక్కులు.. ఇవన్నీ  కాగితాలపైనే కాదు, అధికారుల జేబులపైనే ఆధారపడి పోతున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఈ శాఖే ఇప్పుడు సమస్యలకు మూలంగా మారింది.

Read More 10న స్థానిక సంస్థల తుది ఓటరు జాబితా.

రికార్డుల మాయాజాలం అంతా ఇంతా కాదు :
భూమి రికార్డుల్లో తప్పుడు ఎంట్రీలు, అసలైన యజమానుల పేర్లు తొలగింపు, ధరణి పోర్టల్‌లో తప్పులు.. ఇవన్నీ రైతుల ప్రాణాధారమైన భూములను కబళించే అనకొండలు అయ్యాయి. తన భూమిపై హక్కు నిరూపించుకోవడానికి రైతు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి కలుగుతోంది.. 

Read More అధిక వర్షాలతో దెబ్బతిన్న జనగాంమర్రి, మాందాపూర్ రోడ్ పునరుద్ధరణ

పెచ్చుమీరిన లంచాల సంస్కృతి :
మ్యూటేషన్ చేయించుకోవాలా? పాస్‌బుక్ కావాలా? సర్వే చేయించుకోవాలా? ప్రతి అడుగుకూ లంచం తప్పనిసరి. “లంచం లేకుండా రెవెన్యూ  శాఖలో పని జరగదు” అనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇది ఒక విధంగా అధికారిక సత్యంలా మారింది.

Read More జిల్లాలో రామకృష్ణ మట్ ఆధ్వర్యంలో లింగంపేట మండలంలోని పోల్కంపేట్ రైతువేదికలో మెడికల్ క్యాంప్

అక్రమ రిజిస్ట్రేషన్ల విష వలయం :
ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, దేవాదాయ భూములు.. ఈ భూముల్లో అక్రమార్కుల చేతుల్లో ఏవీ తప్పించుకోలేవు.. అక్రమ రిజిస్ట్రేషన్లతో కోట్ల రూపాయల భూములు అక్రమార్కుల ఖాతాల్లోకి జారిపోతున్నాయి.. దీనికి అధికారుల, మధ్యవర్తుల, రాజకీయ నాయకుల చేతులు కలిసిపోయాయి అన్నది నగ్న సత్యం.. బహిరంగంగా ప్రజల్లో కూడా ఇవే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read More మాతృభాషలో విలువలతో కూడిన విద్యను బోధించాలి

రైతు దుస్థితి అలవికానిది :
భూమి రికార్డులు తప్పుగా ఉండటంతో రైతు పంట రుణం పొందలేకపోతున్నాడు. అప్పులు, కోర్టు కేసులు, ఆర్థిక ఇబ్బందులు.. ఇవన్నీ రైతు జీవితాన్ని దుస్థితిలోకి నెడుతున్నాయి. “భూమి మీద నాకున్న హక్కు నిరూపించుకోవడమే ఒక యుద్ధం” అంటున్నారు అనేకమంది రైతులు.

Read More 111 జీఓ పరిధిలో అక్రమ నిర్మాణాలు..

మార్పు తప్పనిసరి :
ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న ఒక్కటే..  ఈ దోపిడీకి అంతం లేదా..? 
అవినీతి చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోగలగాలి.. గ్రామస్థాయిలో భూ రికార్డులను ఒక క్రమ పద్దతిలో క్షుణ్ణంగా ఎలాంటి తారతమ్యాలు లేకుండా తనిఖీ చేయాలి. ఒకప్పటి ధరణి ఇప్పటి బిల్డ్ నౌ లాంటి ఆన్‌లైన్ వ్యవస్థలను పారదర్శకంగా, బలోపేతం చేయాలి. రాజకీయ జోక్యాన్ని పూర్తిగా అరికట్టాలి.. 

Read More బీర్కూర్ తండా నుండి తెలంగాణ తిరుపతి దేవస్థానంకు వెళ్లే దారి మరమ్మతులు..

రైతు కన్నీటిని తుడవడం, ప్రజల భూమికి భద్రత కల్పించడం ప్రభుత్వానికి పెద్ద సవాలు. రెవెన్యూ శాఖలో మార్పు రాకపోతే, అది కేవలం రైతుకే కాదు, తెలంగాణ సమాజానికే ఒక పెద్ద దెబ్బగా మిగిలిపోతుందని హెచ్చరిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. .

Read More నేటి భారతం :

About The Author