నేటి భారతం :
నువ్వు మట్టిలో బ్రతుకుతావు..
మాకోసమే బ్రతుకుతావు..
మట్టిని దైవంగా కొలుస్తావు..
పైరును నీ ప్రాణంగా భావిస్తావు..
నీ స్వేదంతో ఈ నేలను తడుపుతావు..
నేల నుంచి సిరులు పండిస్తున్నావు..
వానచుక్క కోసం పడిగాపులు కాస్తావు..
కరువు రక్కసితో నిరంతరం యుద్ధం చేస్తుంటావు..
ఎంతో కష్టపడి పంటసాగు చేస్తావు..
గిట్టుబాటు ధరలేక రోదిస్తుంటావు..
మా అందరికీ అన్నం పెడుతున్నావు..
నువ్వు మాత్రం పురుగుల మందు సేవిస్తున్నావు..
నీ పెదాలపై చిరునవ్వు మాకు శుభిక్షం రైతన్నా..
ఇక నీ కన్నీరు మాకు దుర్భిక్షం రైతన్నా..
రైతుల బ్రతుకు మారాల్సింది సినిమాల్లో కాదు..
కథల్లో, కవితల్లో, భావోద్యేగమైన కథనాల్లో కాదు..
రైతుల జీవితాలు మారాల్సింది వ్యవసాయ క్షేత్రాల్లో
Read More రక్తదానం మహాదానం
About The Author
12 Sep 2025