బిసీలకు రిజర్వేషన్ అమలుపట్ల హర్షం..
మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు శెట్టి రంగారావు
ఖమ్మం :
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఆమోదం చేయడం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు శెట్టి రంగారావు హర్షం వ్యక్తం చేసారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి ఒక ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు మరియు రాష్ట్ర మంత్రివర్గానికి మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు శెట్టి రంగారావు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న కాలంలో బిసీ లందరు ఐక్యంగా వుండి ఈ రిజర్వేషన్ లను ఉపయోగించుకోవాలని కోరారు. బీసీలు రాజకీయంగా చైతన్యవంతమైన వారని వారికి అవకాశం రావడం ఎంతో మేలు చేస్తుంది అన్నారు.
Read More యూరియా దోపిడీ అరికట్టాలి : సీపీఐ
About The Author
12 Sep 2025