తెలంగాణ వీరనారి చాకలి ఇలమ్మ ఘనంగా వర్ధంతి వేడుకలు
కామారెడ్డి :

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఇలమ్మ వర్ధంతి కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీ ఎల్.బి. చందర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఆర్డీవో శ్రీమతి వీనా చాకలి ఇలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, “చాకలి ఇలమ్మ తెలంగాణ రైతాంగ పోరాటానికి చిహ్నం. దళిత–బహుజన సమాజానికి ఆమె ధైర్యం, పోరాటస్ఫూర్తి నింపిన మహనీయురాలు. ఆమె త్యాగం, వీరస్వభావం తరతరాలకు ఆదర్శం” అని పేర్కొన్నారు.
Read More మాజీ సీఎం రోశయ్యకు ఘన నివాళి
Read More క్రీడలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం
About The Author
06 Dec 2025
