నేటి భారతం :

ఆధునిక జీవనంలో సాంకేతికతను
ప్రధమ స్థానంలో ఆచరించడం ఎంతో అవసరం..
అవసరం లేకపోయినా అనుబంధం పెంచుకోవడం
ప్రమాదాన్ని కొనితెచ్చిపెట్టుకోవడమే..
విషయం పరిజ్ఞానాన్ని పెంచుకోండి..
విషతుల్యమైన ఆలోచనలను కాదు..
ప్రతి చోటికి నువ్వు వెళ్లలేకపోవచ్చు..
కానీ ప్రతి విషయాన్ని నీదగ్గరికి చేరుస్తుంది టెక్నాలజీ..
దగ్గరికి వస్తున్నాయి కదా అని.. మితిమీరి ప్రవర్తించావో..
శరీరాన్నే కాదు, జీవితాన్ని కూడా కోల్పోతావు..
ఈ సాంకేతికతను నిర్మించింది మనమే..
టెక్నాలజీని నిర్మించింది మనమే..
మన ఆలోచనలను, మన మేధస్సును మించింది లేదు..
మనం నిర్మించుకున్న సౌధంలో..
మనం సృష్టించుకున్న మేధా ప్రపంచంలో..
మనం ఏర్పరచుకున్న ఒక ప్లాట్ ఫారంలో..
మనకి మనమే చితిని పేర్చుకోవడం అవివేకం..
వివేకంతో ఆలోచించండి.. విజ్ఞుడిగా నిలబడండి..
ఆల్ ది బెస్ట్..
About The Author
12 Nov 2025
