మహనీయుడు తూము ప్రకాశరావు ఆశయాలను కొనసాగిద్దాం
విజయవంతంగా బత్తినేని వైద్య క్యాంపులు 60వ క్యాంపులో ట్రస్ట్ ఛైర్మన్ బత్తినేని నాగప్రసాదరావు, ఎన్ఆర్ఐ బత్తినేని రాకేష్ లు
ఖమ్మం :
పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన మహానీయుడు తూము ప్రకాశరావు అని బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బత్తినేని నాగప్రసాదరావు, ప్రముఖ ఎన్ఆర్ఐ బత్తినేని రాకేష్ లు కొనియాడారు. మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ప్రతి నెల మొదటి ఆదివారం అమరజీవి తూము ప్రకాశరావు జ్ఞాపకార్ధం బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో 60వ క్యాంప్ బీపీ, షుగర్, కంటి ప్రత్యేక వైద్య శిబిరం ఆదివారం విజయవంతంగా ముగిసింది. ముందుగా ఐదేళ్లు (60వ క్యాంపు) పురస్కరించుకొని అఖిల పక్ష నాయకులతో సిపిఐ మండల కార్యదర్శి యంగల అనందరావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ 60వ క్యాంపుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన బత్తినేని నాగప్రసాదరావు, బత్తినేని రాకేష్ లు మాట్లాడుతూ...... పేదలకు, దళితులకు ఆస్తి దక్కాలన్న ఉద్దేశ్యంతో రాయన్న పేట, కలకోట గ్రామాలలో భూమి, ఇళ్లు, ఇళ్ల స్థలాలు పంచిపెట్టిన ఘనత కమ్యూనిస్టు అయిన ప్రకాశరావుకే దక్కిందన్నారు. ప్రజల కోసం పాటుపడే వారిని ప్రజలు ఎన్నటి మరిచిపోరని అందుకు ప్రకాశరావు జీవితమే నిదర్శమని అన్నారు. తూము ప్రకాశరావు ఈ ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం పోరాడి తన సర్వస్వాన్ని త్యాగం చేశారని, అందుకే ఇప్పటికీ ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. క్యాంపులకు ఆర్థిక సహకారం అందిస్తున్నది తామేనప్పటికీ, నిర్విరామంగా క్యాంపును నడిపించే క్యాంపు నిర్వాహణ కమిటీని ఈ సందర్భంగా వారు అభినందించారు. అఖిల పక్ష నాయకులు క్యాంపును ఉద్దేశించి మాట్లాడుతూ...... మండల ప్రజలు సుదూర ప్రాంతాలకు బిపి, షుగర్, కంటి సంబంధిత ఇబ్బందులకు వెళ్లకుండా ప్రతినెల నిపుణులైన వైద్యులతో వైద్యసేవలందిస్తున్న బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ ను అభినందించారు. సొంత ఊర్లకి సదృద్దేశ్యంతో విద్య, వైద్య, మౌళిక వసతులు కల్పిస్తూ అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న బత్తినేని నాగప్రసాదరావుకు, వారి కుమారులు ప్రముఖ ఎన్ ఆర్ ఐ లు బత్తినేని ప్రకాశ్, బత్తినేని రాకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ క్యాంపులో వైద్యులు టి పవన్ కుమార్ 100 మంది పేషంట్లకు వైద్యసేవoదించగా, ఆర్ఎంపి డబ్ల్యూటీఏటి ఎస్ జిల్లా అధ్యక్షులు బొమ్మినేని కొండలరావు, క్యాంపు సహయకులు ఆకెన పవన్, యంగల గిరిలు క్యాంపును నిర్వహించారు. అనంతరం పేషంట్ల కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన బత్తినేని నాగప్రసాదరావు, బత్తినేని రాకేష్, తూము రోషన్ కుమార్ ల చేతుల మీదుగా మందులు పంపిణీ చేశారు. క్యాంపు ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయా రాజకీయ పార్టీల నాయకులు, క్యాంపు వైద్యులు, క్యాంపు నిర్వహణ కమిటీ సభ్యులు బత్తినేని నాగప్రసాదరావు, బత్తినేని రాకేష్ లకు పూలమాలలు చేసి, శాలువాలను కప్పి ఘన సన్మానం చేశారు. వీరితో పాటు ప్రముఖ బిపి, షుగర్, జనరల్ వైద్యులు టి పవన్ కుమార్, క్యాంపు నిర్వాహకులు బొమ్మినేని కొండలరావు, ఆకెన పవన్, యంగల గిరిలను శాలువాలతో చిరుసన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా అధ్యక్షులు ఏనుగు వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, మధిర ఆత్మకమిటీ చైర్మన్ కర్నాటి రాంకోటేశ్వరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు బి.ఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లి కార్జునరావు, కాంగ్రెస్ మండల నాయకులు పిల్లలమర్రి నాగేశ్వరావు, టిడిపి మండల నాయకులు నందమూరి సత్యనారాయణ, ఆయా పార్టీల నాయకులు చేబ్రోలు వెంకటేశ్వర్లు, పారా ప్రసాద్, మైనేని రవికుమార్, మాజీ మండల కో అప్షన్ సభ్యులు షేక్ హాసన్, సిపిఐ నాయకులు ఏలూరి పూర్ణ చంద్ర రావు, బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు, షేక్ నజీర్, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.