స్వరాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తి కాళోజి
కల్పగూర్ ఉన్నత పాఠశాల హెచ్ఎం శైలజ
సంగారెడ్డి :
స్వరాష్ట్ర ఉద్యమానికి తన రచనలతో స్ఫూర్తి నింపిన గొప్ప కవి కాళోజీ నారాయణరావు అని సంగారెడ్డి మండలం కల్పగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం శైలజ అన్నారు. మంగళవారం పాఠశాలలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి హెచ్ఎం శైలజ ఉపాధ్యాయులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... కాళోజి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని తెలంగాణ భాషను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధుసూదన్ రామకృష్ణారెడ్డి శ్రీనివాస్ గౌడ్ విరాజ్ రెడ్డి కమల్ జిత్ కౌర్ హమీదా బేగం ప్రవీణ్ కుమార్ తేజందర్ సింగ్ రాహుల్ విద్యార్థులు పాల్గొన్నారు.
Read More పార్వతి తనయా వెళ్లిమళ్లీరావయ్యా...!
About The Author
12 Sep 2025