స్మార్ట్‌ఫోన్ రక్కసికి బలైపోతున్న యువత..

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )

- పెరుగుతున్న టెక్నాలజీ ప్రమాదాలు కొనితెస్తోంది.. 
- అరచేతిలో ప్రపంచం అదుపు తప్పుతోంది.. 
- విశృంఖల కార్యకలాపాలకు అవకాశం ఇస్తోంది.. 
- విచ్చలవిడి ప్రపంచాన్ని కళ్లముందుంచుతోంది.. 
- నేర ప్రవృత్తివైపు అడుగులు వేయిస్తోంది.. 
- అదుపు తప్పిన నియంత్రణ అలజడి రేపుతోంది.. 
- పోర్న్ సైట్స్ ను కట్టడిచేయడంలో విఫలమవుతున్న ప్రభుత్వాలు.. 
- ఏమీ తెలియని వయసులోనే ఎదో చెయ్యాలనే కోరికలకు ఆజ్యం.. 
- తాము చేస్తోంది తప్పు అని తెలియకుండానే తప్పులు చేస్తున్నారు.. 
- బంగారు లాంటి భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు.. 
- గంటల తరబడి స్మార్ట్ ఫోన్ వాడటంతో ఆరోగ్యం నాశనం అవుతోంది.. 
- జీవన ప్రమాణం తగ్గడంతో యువత నీరుగారిపోతోంది.. 
- సరైన అవగాహన కల్పించాలని ఒక కార్యక్రమం చేప్పట్టబోతోంది 
  " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..

WhatsApp Image 2025-09-05 at 6.32.35 PM

టెక్నాలజీ మానవ జీవనానికి ఎంతో అవసరం.. ముఖ్యంగా యువత భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేస్తుంది.. ఆధునిక సాంకేతికత ఆధారంగా పోటీ పరీక్షలు, ఇంటర్వూస్, ప్రపంచ జ్ఞానం యువతకు సులువుగా అందుతోంది.. యావత్ ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయింది.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎలాంటి సమయంలో నైనా, ఎలాంటి సహాయం కావాలన్నా స్మార్ట్ ఫోన్ ద్వారా ఎంతో ఈజీగా జరిగిపోతోంది..  సమాచారం ఏదైనా క్షణాల్లో  అందుకునే సౌలభ్యం ఉంటుంది.. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ అడ్డు అదుపూ లేకుండా ఇంటర్నెట్ ద్వారా అందుబాటులోకి వస్తున్న కొన్ని అభ్యంతరకర సైట్లు, అసభ్యకరమైన సైట్లు, నేరాన్ని ప్రోత్సహించే సైట్లు యువతపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతున్నాయి..  ఊహాజనితమైన అనుభవాన్ని, ఉచ్ఛం నీచం అన్నవి ఆలోచించుకోవడానికి వీలుకాని నేరాలను చేసేలా ప్రోత్సహిస్తున్నాయి..  దీనికి సంబందించించిన ఎన్నెన్నో ఉదాంతాలను మనం చూశాం.. వావి వరసలు, వయసు బేధం లేకుండా మహిళలపై జరిగే అకృత్యాలు..  దొంగతనాలు, హత్యలు ఇలా ఎన్నో దారుణాలు ఇంటర్నెట్ ప్రభావంతో చేసిన వారిని చూశాం..  కేవలం యువతే కాకుండా  చిన్నపిల్లలు, పెద్దవారు కూడా ఈ జాడ్యంలో చిక్కుకుని పోతున్నారు.. యూట్యూబ్ వీడియోలు చూస్తూ.. ఆపరేషన్ లు చేసి ప్రాణాలను హరించిన ఎందరో చరిత్రలు చూశాం.. ఇలా చెప్పుకుంటూ పోతే మంచి కంటే స్మార్ట్ ఫోన్స్ ఉపయోగం వల్ల చెడు ఎక్కువుగా జరుగుతోంది అన్నది వాస్తవం..  దీనిపై అన్ని వయసులవారికి అవగాహన కలిపించి చేదు ప్రవృత్తి నుంచి మంచి మార్గం వైపు మల్లెలా ఒక కార్యాచరణ రూపొందిస్తోంది  " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 
      

Read More జిల్లాలో రామకృష్ణ మట్ ఆధ్వర్యంలో లింగంపేట మండలంలోని పోల్కంపేట్ రైతువేదికలో మెడికల్ క్యాంప్

నేటి యువత జీవనశైలి స్మార్ట్‌ఫోన్‌ల చుట్టూ తిరుగుతోంది. విద్య, ఉద్యోగం, వినోదం, స్నేహం, షాపింగ్‌.. ఏది తీసుకున్నా స్మార్ట్ ఫోన్ లేకుండా ఊహించలేము. కానీ ఈ సాంకేతిక ఆశీర్వాదం ఇప్పుడు “స్మార్ట్‌ఫోన్ రక్కసి”గా మారి యువతను తన కబంద హస్తాల్లోకి లాగేస్తోంది.

Read More గోర్ సేన ఆధ్వర్యంలో శాంతి యుత ర్యాలీ

యువతపై అత్యధిక ప్రభావం :

Read More మాతృభాషలో విలువలతో కూడిన విద్యను బోధించాలి

మొదటగా ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఎదురవుతున్నాయి..  నిరంతరం స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూస్తుండటంతో కంటి సమస్యలు, దృష్టి బలహీనత ఏర్పడుతోంది.. మెదడు అలసటకు గురి అవుతోంది.  గంటల తరబడి సోషల్ మీడియాలో గడపడం వల్ల దృష్టి కేంద్రీకరణ తగ్గిపోయి మంద బుద్ధి ఏర్పడుతోంది.. ఇక నిద్రలేమి సమస్య.. రాత్రివేళల ఫోన్ వాడకం కారణంగా నిద్రలేమి, మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది.. తద్వారా బలహీనత ఏర్పడి నిర్వేదం మిగులుతోంది.. మెడ, వెన్నునొప్పులు: ఎక్కువసేపు ఫోన్ వాడకం వల్ల శరీర భంగిమలో కూడా ఊహించని మార్పులు ఏర్పడుతున్నాయి.. రోజు రోజుకు శరీరం క్షీణించిపోవడం కూడా జరుగుతోంది.. 

Read More నిజామాబాదు జిల్లా కేంద్రంలో బిఎల్ టీయూ రెండవ రాష్ట్ర మహాసభలు..

మానసిక రుగ్మతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి.. డిప్రెషన్ కు గురికావడం.. అనవసరమైన పనికిరాని ఆందోళన నెలకొనడం జరుగుతోంది.. సోషల్ మీడియాలో లైక్‌లు, ఫాలోవర్స్ కోసం పరితపించడం.. దీనికోసం ఎంతకైనా తెగించడం జరుగుతోంది.. ఇక ఒంటరితనం అనేది పెను సవాలుగా మారిపోతోంది.. నిజమైన స్నేహాల కంటే వర్చువల్ రిలేషన్లలో ఎక్కువగా మునిగిపోతున్నారు.. దీనికి వయసుతో సంబంధం ఉండటం లేదు.. సింగల్, పెళ్ళైన వాళ్ళు అనే తేడాలు ఉండటం లేదు.. 

Read More మహనీయుడు తూము ప్రకాశరావు ఆశయాలను కొనసాగిద్దాం

విపరీతమైన కోపం, అసహనానికి గురౌతున్నారు.. గేమింగ్, చాటింగ్ వ్యసనం వల్ల కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు తలెత్తుతున్నాయి..  సామాజికంగా ఎంతో వెనుకుబాటు తనానికి బలైపోతున్నారు.. చదువులో వెనుకంజవేయడం.. క్లాసులు, చదువు కంటే సోషల్ మీడియాకు ప్రాధాన్యం ఇవ్వడం విపరీత ధోరణిగా మారిపోతోంది.. దీంతో ఉద్యోగ అవకాశాల కోల్పోతున్నారు.. కెరీర్ చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.. ఫోకస్ తగ్గడం, సమయాన్ని వృథా చేయడం లాంటివి చేస్తున్నారు.. కుటుంబ సంబంధాలకు ఎంతో దూరం అవుతున్నారు.. ప్రతి ఒక్కరూ ఫోన్‌లో మునిగిపోవడంతో కుంటుంబంలో ఒకరినొకరు సంభాషించుకోవడం తగ్గిపోతోంది.. బంధాలు బాంధవ్యాలు కనుమరుగైపోతున్నాయి.. 

Read More అవినీతినే తన స్టాంపుగా మార్చుకున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ..

ఇటీవలి కాలంలో నిపుణులు చేసిన పరిశోధనల ప్రకారం.. సగటున ఒక యువకుడు లేదా యువతి రోజుకు 5 నుంచి 7 గంటల వరకు స్మార్ట్‌ఫోన్‌లో గడుపుతున్నారు.. 60శాతం కంటే ఎక్కువ మంది యువత రాత్రి 12 తర్వాత కూడా ఫోన్ వాడుతున్నారు. 40శాతం మంది స్మార్ట్‌ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేము అని చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో పెను ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.. చిన్న వయసులోనే యువత నిర్వీర్యం అవుతోంది.. సంసారాలు విచ్చిన్నం అవుతున్నాయి.. హత్యలు, దోపిడీలు పెరిగిపోతున్నాయి.. సైబర్ నేరగాళ్లు విశృంఖలత్వాన్ని చూపిస్తున్నారు..  మొత్తానికి స్మార్ట్ ఫోన్ అనేది ఒక భూతంలా పట్టి పీడిస్తోంది అని చెప్పవచ్చు.. 

Read More నిర్మల్ పోలీసింగ్ లో మహిళా మైలురాయి..

మరి పరిష్కారాలు లేవా..? అంటే ఖచ్చితంగా ఉన్నాయి.. కానీ వీటిని అమలయ్యేలా చూసేది ఎవరు..? దీనికోసం నడుం కట్టేదెవరు.. ప్రభుత్వాలను నమ్ముకుంటే పని జరగదు.. అందుకే న్యాయకోవిదులు, సంఘసంస్కర్తలు, స్వచ్చంద సంస్థలు పూనుకోవాలి.. ఇందులో భాగంగానే ముందడుగు వేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..  

Read More బిసీలకు రిజర్వేషన్ అమలుపట్ల హర్షం..

నిపుణులు సూచిస్తున్న కొన్ని పరిష్కారమార్గాలు ఇలా ఉన్నాయి : 

Read More రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎలక్షన్ గోడౌన్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్..

మొదటిది డిజిటల్ డిటాక్స్ అంటే రోజులో కొన్ని గంటలు ఫోన్‌ను పక్కన పెట్టడం. స్క్రీన్ టైమ్ కంట్రోల్ అంటే ఫోన్‌లో లిమిట్స్ సెట్ చేసుకోవడం. స్పోర్ట్స్, హాబీస్ అంటే క్రీడలు, పుస్తకాలు, సంగీతం వంటి వాటికి సమయం కేటాయించడం. ఇక ముఖ్యంగా ఫ్యామిలీ టైమ్..  రోజులో కనీసం గంటసేపు కుటుంబంతో గడపడం. సోషల్ మీడియా డైట్ అంటే అవసరం లేని యాప్స్‌ను తొలగించడం. ఖచ్చితంగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.. 

Read More యూరియా దోపిడీ అరికట్టాలి : సీపీఐ

ఇక చివరగా చెప్పుకోవాల్సింది.. స్మార్ట్‌ఫోన్ జీవనాన్ని సులభతరం చేస్తుంది, కానీ దానిని అదుపులో వాడకపోతే అది రక్కసిలా మారి మన ఆరోగ్యం, చదువు, భవిష్యత్తును మింగేస్తుంది. కాబట్టి “సాంకేతికతను మనం వాడాలి, అది మనల్ని వాడకూడదు” అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 

 

About The Author