వికలాంగులకు, చేయూత పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలి

పెన్షన్ దారులతో జిల్లా కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహించిన ఎమ్మార్పీఎస్, వి హెచ్ పి ఎస్ నాయకులు

సంగారెడ్డి : 

WhatsApp Image 2025-09-08 at 7.02.33 PM

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకు రూ. 6000/-, చేయూతపెన్షన్ దారులకు రూ. 4000/- వెంటనే పెన్షన్ పెంచాలని  వి ఎస్ రాజు మాదిగ  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమనికి  ముఖ్య అతిథులుగా, వి ఎస్ రాజు మాదిగ, ఎంఎస్పి రాష్ట్ర నాయకులు జిల్లా ఇన్చార్జి, రామారాపు శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ పాల్గొన్నారు. 

Read More నేటి భారతం :

వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, బీడీ, గీత కార్మికులకు, కండరాల క్షీణత కలవారికి రూ. 15000/- పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు 4000 /-నుండి 6000,/-.. చేయూత పెన్షన్ దారులకు 2000/- నుండి 4000 /-ఇస్తానని ఎన్నికలో హామీ ఇచ్చి ఇప్పటికి రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచిపోయిన ఇప్పటివరకు వారికి పెన్షన్ పెంచలేదని విమర్శించారు. పెన్షన్ పెంచకుండా నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ రెడ్డి తీరుకు నిరసనగా ఈ వికలాంగుల హక్కుల పోరాట సమితి  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి  ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు పెన్షన్ దారులతో మహాధర్నా నిర్వహించారు. తదనంతరం జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. 
ఎంమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పెన్షన్ పెంచాలని అనేక రకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాము. పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలని ప్రభుత్వ  దృష్టికి తీసుకెళ్లాలని  కోరడం జరిగింది..  వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, నేత, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రవికుమార్ విహెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు, దేవరంపల్లి అశోక్, విహెచ్పిఎస్ జిల్లా కన్వీనర్, పెద్ద గీత మాదిగ, ఎంఎంఎస్ రాష్ట్ర నాయకురాలు, విహెచ్పిఎస్ జిల్లా కో కన్వీనర్లు తుమ్మల యాదగిరి, నర్సిములు, పొట్టొలా వెంకటేష్, పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జ్, సడాపుల కృష్ణ మాదిగ, సీనియర్ నాయకులు, సుధాకర్, విహెచ్పిఎస్ కొండాపూర్ మండల్, రామ్ శెట్టి వి హెచ్ పి ఎస్ జహిరాబాద్ నాయకులు, ముక్క గళ్ళ కవిత ఎమ్మెస్ జిల్లా అధ్యక్షురాలు, నల్లోల్ల ప్రవీణ్, కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి, బాపనపల్లి రవి మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు, నటరాజ్ మాదిగ, కొంగేరి కృష్ణ, జంగం విజయ్ కుమార్, రవికుమార్ బిహెచ్ఇఎల్, మల్లెపల్లి శ్రీకాంత్, రాజేందర్, జిల్లా, మండల్ ఎం ఆర్ పి ఎస్ అనుబంధం సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More నేటి భారతం :

About The Author