కాళోజి జయంతి వేడుకలు

కవికి నివాళులర్పించిన జిల్లా అధికారులు.

సంగారెడ్డి :

WhatsApp Image 2025-09-09 at 5.41.45 PM

కళ, సాహిత్యం, సామాజిక న్యాయం కోసం కాళోజి చూపిన కృషిని స్ఫూర్తిగా తీసుకోవాలని, డి ఆర్ ఓ పద్మజారాణి అన్నారు .    వెనుకబడినతరగతుల శాఖ ఆధ్వర్యంలో  కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి  వేడుకలను   ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ రాణి కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భముగా డిఆర్ఓ మాట్లాడుతూ,   స్వాతంత్ర్య సమరయోధుడు,  ప్రజాకవి కాళోజి తెలుగు సాహిత్యాన్ని కొత్త దిశగా మలిచారని,  కాళోజి రచనలు ప్రజలకు చైతన్యం నింపాయని తెలిపారు. ఆయన  జీవితం సాదాసీదాగా ఉన్నా ఆయన ఆలోచనలు మహత్తరమని,   కాళోజి మాటలు ప్రజల మనసులను కదిలించే శక్తి కలిగినవని అన్నారు. కవిత్వాన్ని ప్రజల సమస్యలతో మేళవించి సాహిత్యాన్ని ఒక ఉద్యమంగా మార్చిన వ్యక్తి కాళోజి మాత్రమేనని వివరించారు. సాహిత్యం తరతరాలను చైతన్యపరుస్తుందని,  ఆలోచనలు ఈనాటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. కవిత్వం కేవలం సాహిత్యానికే పరిమితం కాకుండా, సమాజ మార్పుకు దారితీసే మార్గదర్శక శక్తిగా ఉన్నదని పేర్కొన్నారు. కళ, సాహిత్యం, సామాజిక న్యాయం కోసం కాళోజి చూపిన కృషిని స్ఫూర్తిగా తీసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు,యువత కాళోజి బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెనుకబడినతరగతుల శాఖ అధికారి జగదీష్ , అధికారులు, సిబ్బంది, సాహితీ ప్రేమికులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Read More నేటి భారతం :

About The Author