గౌడ జర్నలిస్టులకు ఆత్మీయ సన్మానం

ములుగు జిల్లా :

WhatsApp Image 2025-09-10 at 5.36.24 PM

జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ కమ్యూనిటీ హాల్ లో కల్లు గీత కార్మిక సంఘం ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని గౌడ జర్నలిస్టులను సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం చేశారు.  కల్లు గీత కార్మిక సంఘం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఉయ్యాల మధుకర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్ జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ లు హాజరై మాట్లాడు తూ కల్లు గీత కార్మికుల ఉద్యమాలను ముందుకు తీసుకొని పోవాలని అలాగే గౌడ జర్నలిస్ట్ లు ఐక్యంగా ఉండి భవిష్యత్తు ఉద్యమాలలో ప్రత్యేకంగా పాల్గొని సంఘం లో భాగస్వాములు కావాలని రవిగౌడ్. శ్రీనివాస్ గౌడ్ లు పిలుపు నిచ్చారు. కార్యక్రమానంతరం గౌడ జర్నలిస్టులను సంఘ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఎన్జీవోస్  జిల్లా ప్రధాన కార్యదర్శి మేడి చైతన్య గౌడ్, దేశిని మహేందర్ గౌడ్. మామిడి సంపత్ గౌడ్. గట్టు ప్రశాంత్ గౌడ్. దేశిని వినయ్ గౌడ్. మొడెం సారంగపాణి గౌడ్. నాగపూరి హరినాథ్ గౌడ్. కోలా కోటి గౌడ్.వేముల సతీష్ గౌడ్.కునూరు మహేందర్ గౌడ్ తో పాటు 15 మంది గౌడ జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

Read More నిజామాబాదు జిల్లా కేంద్రంలో బిఎల్ టీయూ రెండవ రాష్ట్ర మహాసభలు..

About The Author