గ్రూప్ వన్ రద్దుకు నిరసన వ్యక్తం చేసిన బి ఆర్ ఎస్ వి నాయకులు

సంగారెడ్డి :

WhatsApp Image 2025-09-11 at 7.02.00 PM

గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సంగారెడ్డి బి ఆర్ ఎస్ వి  నియోజకవర్గ అధ్యక్షులు పెద్దగొల్ల శ్రీహరి,కో ఆర్డినేటర్ రాజేందర్ నాయక్  డిమాండ్ చేశారు.రాష్ట్ర బి ఆర్ ఎస్ వి  అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ పిలుపు మేరకు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బి ఆర్ ఎస్ వి జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు పెద్దగొల్ల శ్రీహరి , కో ఆర్డినేటర్ రాజేందర్ నాయక్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ టిజిఎస్పిసి  చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.అభ్యర్థులకు 28 కేంద్రాల్లో సెంటర్లు కేటాయించగా కోటి ఉమెన్స్ కాలేజీలో మహిళ అభ్యర్థులకి ప్రతేకంగా రెండు సెంటర్లలో 71 మంది ఎంపికయ్యారు. మిగిలిన 26 సెంటర్లో 139 మంది ఎంపికయ్యారు.ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. 563 ఉద్యోగాలలో కేవలం 9 శాతం మంది మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నట్లు టీజీపీఎస్సీ షీల్డ్ కవర్లో పేర్కొంది.ఇంగ్లీష్ లో 12,381 మంది పరీక్ష రాస్తే 508 మంది ఎంపికయ్యారు, తెలుగు లో 8,694 మంది పరీక్ష రాస్తే కేవలం 56 మంది మాత్రమే ఎంపికయ్యారు. దీనివల్ల తెలుగు మీడియం చదివిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. అభ్యర్థులు రీ కౌంటింగ్ అప్లికేషన్ చేసుకుంటే వాళ్లకు మార్కులు తగ్గాయి..నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న పబ్లిక్ కమిషన్..2 హాల్టికెట్స్ గతంలో 2011 ఇచ్చినం అని హైకోర్ట్ కి తెలిపిన కమిషన్ ఆ రోజు సమాఖ్య రాష్ట్రంలో నాటి కమిషన్ చైర్మెన్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్యాయం జరిగింది అని పోరాడినం ,ఇప్పుడున్న కమిషన్ అదే విధానాన్ని అనుసరించటం వల్ల గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం పట్టింపులకు పోకుండా  హైకోర్ట్ డివిజన్ బెంచికి మరియు సుప్రీంకోర్టు కి వెళ్లవద్దని అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Read More స్మార్ట్‌ఫోన్ రక్కసికి బలైపోతున్న యువత..

ఈ కార్యక్రమంలో సదాశివపేట మండల అద్యక్షులు పాండు నాయక్, అఖిల్,  నాయకులు సందీప్, అక్షయ్, నాసర్, కార్తిక్, శశి, తారా కళాశాల అద్యక్షులు శ్రీమాన్, భాను ఉదయ్, సాయితేజ, సాయికుమార్, వేణు, నాయకులు పాల్గొన్నారు.

Read More స్వరాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తి కాళోజి

About The Author