
2025,అక్టోబర్,11,12,న నిజామాబాదు జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక జిల్లాసంఘం, బిఎల్ టీయూ,రెండవ రాష్ట్ర మహా సభలను జయప్రదం కోసం, గోడ ప్రతులను శుక్రవారం ఆవిష్కరించారు.
నిజామాబాదు జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, బిఎల్ టీయూ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు యస్. సిద్దిరాములు ఆధ్వర్యంలో 2025,అక్టోబర్,11,12, తేదీల్లో నిజామాబాదు జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర రెండవ మహా సభల " గోడ ప్రతుల (వాల్ పోస్టర్లు) ఆవిష్కరణ చేసారు. అనంతరం విలేకరుల సమావేశంలో బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు యస్. సిద్దిరాములు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రములోని బీడీ పరిశ్రమకు పుట్టినిల్లు అయినా నిజామాబాదు జిల్లా కేంద్రంలో అక్టోబర్ 11,12 తేదీ ల్లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ రాష్ట్ర రెండవ మహా సభలు, నిర్వహించడం మొదటి రోజు, అక్టోబర్ 11న మద్యాహ్నం1గంటకు, తిలక్ గార్డెన్ నుండి భారీ ర్యాలీగా పాత కలెక్టర్ కార్యాలయం వరకు,మద్యాహ్నం 2 గంటలకు, పాత కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్ లో "బహిరంగ సభ" ఉంటుంది.
రెండవ రోజు అక్టోబర్12 న నిజామాబాదు తిలక్ గార్డెన్"న్యూ అంబేద్కర్ భవనంలో ప్రతినిధుల మహా సభ, ఉదయం,10,గంటలకు, ప్రారంభం అవుతుంది. మొదటి రోజు బహిరంగ సభకు ముఖ్య అతిథిగా గ్రామీణాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు, శ్రీ మంత్రి సీతక్క,ఉమ్మడి నిజామాబాదు జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు అతిధులు కా|| నల్ల సూర్య ప్రకాష్, బిఎల్ ఎఫ్, చైర్మన్ జయరాజ్, పకృతి కవి, రచయిత ఏపూరి సోమన్న, బహుజన యుద్ధ నౌక సుభద్ర కవి, రచయిత,వక్తలు దండి వెంకట్, బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు యం. ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగరపు యెల్లయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్. డి.సయ్యద్, రాష్ట్ర కోశాదికారి తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం సబ్బని లత, బహుజన లెప్ట్ మహిళ సంఘం, రాష్ట్ర అధ్యక్షురాలు మంత్రి సుదర్శన్, రాష్ట్ర అధ్యక్షులు, తిరుపతి గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడ్ల రాజు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బాస్కర్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు తెలంగాణ బహుళ జన బీడీ టేకేదార్ యూనియన్ బి. జగదీష్, నిజామాబాదు జిల్లా అధ్యక్షులు చట్ల పొశవ్వ, నిర్మల్ జిల్లా అధ్యక్షులు కే.శ్రీహరి, జిల్లా అధ్యక్షులు బి. నర్సిములు, జిల్లా కార్యదర్శి సిద్దిపేట జిల్లా గంగా మణి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుమ్మరి రవి, కామారెడ్డి జిల్లా కార్యదర్శి, యం. ప్రభాకర్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు రోహిణి, మెదక్ జిల్లా అధ్యక్షురాలు, యం. రాజేంద్రర్, బిఎల్ టీయూ నిజామాబాదు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.రాజు, సిరిసిల్ల జిల్లా కార్యదర్శి తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం వడ్ల సాయి కృష్ణ, బిడియస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, తదితరులు హాజరయి ఈ సభను జయప్రదం చేయాలని కార్మిక వర్గం విజ్ఞప్తి చేశారు.
గత రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, తెలంగాణ రాష్ట్రములోని బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్య పై రాజీలేని పోరాటం చేయడం జరిగింది. చేసిన పోరాటాలను ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్ ఉద్యమ కర్తవ్యాలు,
కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భాలలో బీడీ కార్మికులందరికీ 4016 రూ.ల, జీవన భృతి ఇస్తామని, బీడీ కార్మికుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి రెండు సంవత్సరాలు అవుతున్న బీడీ కార్మికులకు 4016 రూ.లు, ఇవ్వలేదు. 2014 పిబ్రవరి 28 కటాప్ తేదిని తొలగించలేదు, కేంద్రం ప్రభుత్వం ఇపిఎఫ్ పెన్షన్ పెంచిన 3000/- ఇవ్వడం లేదు, బీడీ పరిశ్రమపై లేని పోని ఆంక్షలు పెట్టి బీడీ పరిశ్రమపై జిఎస్టీ, 28% నుండి నేడు 40% కు పెంచడం జరుగిందని, దీని ద్వారా బీడీ కార్మికులు మరింత ఉపాది దెబ్బ తినడం కోసం బహుళ జాతీయ కంపనీలతో కేంద్ర ప్రభుత్వం, కుమ్మక్కై, బీడీ కార్మికులకు ఉపాది లేకుండా చేస్తుంది, ఇట్టి విషయాల పై,మరింత పోరాటం చేయడానికి అక్టోబర్ 11,12, తేదీల్లో నిజామాబాదు జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర రెండవ మహా సభలకు వేల సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ రాష్ట్ర కోశాధికారి యస్. డి.సయ్యద్, ఎ. లస్మబాయి జి.ఇందిరా, ఎ. చిన్న గంగు, చాకలి గోదావరి, కే. పద్మ, ఎ. రాజాగంగు, చిన్న లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.