సంగారెడ్డి జిల్లాలో ఫోటో ఎక్స్పో గోడ పత్రిక ఆవిష్కరణ

సంగారెడ్డి :

WhatsApp Image 2025-09-09 at 6.47.33 PM

ఫోటో ఎక్స్పో ఆవిష్కరణ ను టి జి ఐ ఐ సి చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణ మరియు మండల అధ్యక్షులు సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు సుప్పాల శ్రీనివాస్, కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి పుట్టి బాలరాజు, కుటుంబ భరోసా జిల్లా ఇన్చార్జ్ సాయి మరియు పట్టణ కోశాధికారి మురళి, సీనియర్ ఫోటోగ్రాఫర్లు అప్ప ప్రభాకర్, గోపాల్, సురేష్, యాదగిరి, లక్ష్మణ్, రవికాంత్, మరియు కొండాపూర్ మండలం ఆధ్వర్యంలో అధ్యక్షులు కర్ణం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. అలాగే జిల్లాలోని నాలుగు డివిజన్లో మరియు పట్టణాలు మండలాలలో ఘనంగా గోడ పత్రిక ఆవిష్కరణను నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు సుప్పాల శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలోని ఫోటోగ్రాఫర్లు పెద్ద ఎత్తున ఫోటోగ్రాఫర్ల పండుగ కు విచ్చేసి మన వృత్తిలో వచ్చే కొత్త కొత్త మార్పు చేర్పులను, ఎక్స్పోకు వచ్చి, తిలకించి, తమ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.

Read More నేటి భారతం :

About The Author