జీవితం ఒక వింత నాటకం… ఒక్కో మనిషిది, ఒక్కో గాధ

సంగారెడ్డి :

WhatsApp Image 2025-09-08 at 6.40.37 PM

బీహార్ నుంచి వలస వచ్చి పటాన్చెరు నియోజకవర్గం బొంతపల్లిలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబం తన కొడుకు చోటు(27) వివాహం తర్వాత తన భార్య ఎవరితోనో వెళ్లిపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటనతో వారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయింది. ఈ క్లిష్ట సమయంలో ఎం డి ఆర్ ఫౌండేషన్ మానవతా ధర్మం మరువకుండా వారి అంత్యక్రియలను నిర్వహించి అండగా నిలిచింది.మనిషి ఎంత కష్టాల్లో ఉన్నా ఆత్మహత్య పరిష్కారం కాదు. మనసుకు భారంగా అనిపించినప్పుడు మన దగ్గర వాళ్లతో, స్నేహితులతో, సమాజంలో అందుబాటులో ఉన్న సహాయ కేంద్రాలతో మాట్లాడాలి. మనసు విప్పి చెప్పడం వల్లనే సమస్యలకు మార్గాలు దొరుకుతాయి.

Read More సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు

About The Author