లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్ శిబిరం విజయవంతం.
వేములవాడ :
రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో,లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి ఆపరేషన్ శిబిరానికి విశేష స్పందన లభించింది. పట్టణంలోని మాతృశ్రీ హాస్పిటల్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ శిబిరంలో మొత్తం 110 మంది హాజరై కంటి, రక్తపరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 38 మంది రోగులను కంటి ఆపరేషన్‌కు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆపరేషన్ కోసం ఎంపికైన వారిని వేములవాడ నుంచి రేకుర్తి కంటి ఆసుపత్రికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, ఆపరేషన్ అనంతరం మందులు, కంటి అద్దాలు, భోజనం కూడా పూర్తిగా ఉచితంగా అందజేస్తామని తెలిపారు.ఈ శిబిరానికి సహకరించిన అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ లైన్స్ క్లబ్ నాయకులు కోళ్ల శ్రీనివాస్, రూరల్ అధ్యక్షుడు కొలిపాక నరసయ్య, బచ్చు వంశీకృష్ణ, కటకం శ్రీనివాస్, డాక్టర్ కోయినేని ప్రవీణ్, రవి వైద్యులు, మెడికల్, లైన్స్ క్లబ్ నిర్వాహకులు తోపాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.