దేవుడు గుడిలో ఉండాలి మతం భక్తి గుండెల్లో ఉండాలి.
ఖమ్మం :
హింస,వెట్టిచాకిరి అణచివేత నుంచి పుట్టిన చైతన్యమే .. తెలంగాణ సాయుధ పోరాటం
రజాకార్లకు చమటలు పట్టించిన కమ్యూనిస్టులు
రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో బెజవాడ రవిబాబు
హింస,వెట్టిచాకిరి అణచివేత నుంచి పుట్టిన చైతన్యమే తెలంగాణ సాయుధ పోరాటం అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రవిబాబు అన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు మధిర మండల పరిధి తొండల గోపవరం గ్రామంలోని రైతాంగ సాయుధ పోరాట యోధులు నల్లమల గిరిప్రసాద్ స్మారక వద్ద గురువారం ప్రారంభమయ్యాయి.ముందుగా సిపిఐ నేతలు గిరి ప్రసాద్ స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.వారోత్సవాలకు సూచికగా అరుణ పతాకాన్ని బెజవాడ రవిబాబు ఆవిష్కరించారు.అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంఏ రహీం, మండల కార్యదర్శి ఊట్ల కొండలరావు రైతాంగ సాయుధ పోరాటం వారోత్సవాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో బెజవాడ రవి బాబు మాట్లాడుతూ,రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర గొప్పదని,భూమి,భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం తమ ప్రాణాలు అర్పించి పోరాటం కొనసాగించారని అన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గార్ల,బయ్యారం, ఇల్లెందు ప్రాంతాల్లో నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయని దీంతో రజాకార్ల తూటాలకు 50 మంది దాకా బలయ్యారని వారి మృతదేహాలను గ్రామాల్లో ఊరేగించి పైశాచికానందం పొందారని తెలిపారు.మధిర నియోజకవర్గంలో ప్రతి ఊరు నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిందని మధిర పక్కనుండే అల్లీనగరం గ్రామస్తులు రజాకార్లను తరిమి తరిమి కొట్టారని తర్వాత..మరింత సేనలతో వచ్చి..ఇళ్లు తగలబెట్టి.. గ్రామంలో విధ్వంసం సృష్టించారని తెలిపారు. గోవిందపురంలోఇలాంటి ఘటనే జరిగిందని తెలిపారు.రజాకార్ల అరాచకాలతో చితికిపోయిన బతుకులన్నీ కమ్యూనిస్టు నాయకుల పిలుపుతో బంధుకులు పట్టి ముందుకు కదిలాయి పలుగు,పారా,కారం,రోకలి బరిసెలు ఇలా ఏది దొరికితే అది పట్టుకొని ఆడ మగ అనే తేడా లేకుండా అంతా సాయుధులై ముందుకు కదిలి,నిజాం పోలీసులకు రాజాకారులకు కమ్యూనిస్టులు చమటలు పట్టించారని తెలిపారు.ఈ పోరాటంలో మధిర ప్రాంతం నుండి నల్లమల గిరి ప్రసాద్,వాసిరెడ్డి వెంకటపతి ఇంకా అనేక మంది నేతలు రజాకారులను తరిమి కొట్టారని తెలిపారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఫలితంగా ఈ ప్రాంతంలో 10లక్షల భూములను పేదవారికి పంచినట్లు గుర్తుచేశారు.నాలుగు వేల మంది అమరవీరుల బలిదానంతో స్వరాజ్యాన్ని సాధించారని అన్నారు.రైతంగ సాయిధ పోరాట స్ఫూర్తితో ప్రజా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు పెరుమాళ్ళపల్లి ప్రకాష్ రావు,సిపిఐ సీనియర్ నాయకులు మంగళగిరి రామాంజనేయులు, చెరుకూరి వెంకటేశ్వర్లు,మడుపల్లి లక్ష్మణ్,తలారి రమేష్,కొండూరి నాగేశ్వరావు,రంగు నాగ కృష్ణ,పరుచూరి రాము, జిల్లా బ్రమ్మం,గోపి తదితరులు పాల్గొన్నారు.